Virosh Coorg reception: కూర్గ్‌లో విరోష్ రిసెప్షన్.. ట్రెడిషినల్ డ్రస్పింగ్‌లో మెరిసిన విజయ్‌, రష్మిక

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు సెలబ్రిటీ వెడ్డింగ్ స్టైల్‌లో సరికొత్త పంథాను అవలంభిస్తూ ట్రెండ్ సెట్టర్స్‌గా నిలుస్తున్నారు. తమ పెళ్లి, రిసెప్షన్, హనీమూన్ ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విభిన్నంగా నిర్వహిస్తున్నారు. రెండు నెలలు కావొస్తున్నప్పటికీ విజయ్ - రష్మికల పెళ్లి సందడి కొనసాగుతూనే ఉంది. ఈ తరహా వెడ్డింగ్‌ను ఎంచుకున్నది బహుశా వీరిద్దరు మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా రష్మిక మందన్న స్వగ్రామంలో విరోష్ జంట పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ వివరాల్లోకి వెళితే..

తమ సుధీర్ఘ ప్రేమాయణానికి తెరదించుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటయ్యారు రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో తెలుగు, కొడవ సాంప్రదాయలను అనుసరించి విరోష్ జంట పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కొత్త దంపతులు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంతోషంగా గడుపుతున్నారు. తమ పెళ్లి వేడుకలలో దేశ ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ప్రజలకు స్వీట్స్ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. విజయ్ దేవరకొండ పూర్వీకుల స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా బలమూరు మండలం తుమ్మన్‌పేటలో కొత్త జంట సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు.

Virosh Coorg reception Vijay Deverakonda and Rashmika Mandanna Shine At Kodagu Reception In Stunning Looks

అలాగే అచ్చంపేట డివిజన్‌లోని 44 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 9, 10 తరగతులు చదువుతున్న పిల్లల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మార్కులు సాధించిన వారికి స్కాలర్‌షిప్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు విజయ్ దేవరకొండ. తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అభిమానులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు విజయ్ - రష్మిక. అనంతరం మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో భారీ వెడ్డింగ్ రిసెప్షన్‌‌ జరిగింది.

పెళ్లి తర్వాత అన్ని కార్యక్రమాలను ముగించుకుని విజయ్ - రష్మికలు హనీమూన్‌ నిమిత్తం థాయ్‌లాండ్‌లోని కో సామ్యూయ్ దీవికి వెళ్లారు. వీరి వెంట స్నేహితులు కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనికి బడ్డీమూన్ అని పేరు. ఈ తరహా కల్చర్‌ను తెలుగువారికి పరిచయం చేసింది విరోష్ జోడీ. ఇండియాకు తిరిగొచ్చిన వెంటనే ఇద్దరూ తమ రోజువారీ జీవితంలో బిజీ అయ్యారు. విజయ్ తన రణబాలి షూటింగ్‌లో, రష్మిక మందన్న తన ప్రాజెక్ట్స్‌లో పాల్గొంటున్నారు.

తాజాగా విజయ్ దేవరకొండ తన భార్య రష్మిక మందన్నతో కలిసి అత్తగారి ఊరు కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేటకు చేరుకున్నారు. ఇక్కడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోసం రష్మిక కుటుంబం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. అత్తగారి ఊరిలో కొత్త అల్లుడు విజయ్ దేవరకొండకు ఘన స్వాగతం పలికారు. తన భార్యను తీసుకుని ఫంక్షన్ హాల్‌కు రాగా.. అంతా కొడవ సాంప్రదాయంలో వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా రష్మిక తన కొడవ ట్రెడిషనల్ శారీలో మెరిసిపోయారు. విరాజ్‌పేట‌లోని సెరినిటీ హాల్‌లో జరిగిన పూర్తిగా కొడవ సాంప్రదాయ పద్ధతుల్లో విరోష్ రిసెప్షన్ జరిగింది. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి.. కేవలం ఆహ్వానం ఉన్న వారికే మాత్రమే లోపలికి అనుమతించారు. ఈ సందర్భంగా కొడవ సంస్కృతి, కొడవ వెరైటీలను విజయ్‌కు పరిచయం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X