Virosh Reception: విజయ్-రష్మిక కీలక నిర్ణయం.. ఆ విద్యార్థులకు భారీ శుభవార్త.. సొంతూరికి కూడా ..
Vijay Deverakonda - Rashmika Mandanna: టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరిద్దరి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఐటీసీ మెమోంటో హోటల్లో గ్రాండ్ గా జరిగింది. అనంతరం హైదరాబాద్ వచ్చిన ఈ జంట..సోమవారం విజయ్ సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలంలోని తుమ్మన్ పేట గ్రామంలో సందడి చేశారు. ఈ సందర్భంగా రష్మిక - విజయ్ దేవరకొండ జంట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏ నిర్ణయమేంటీ?
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా దంపతులు సోమవారం ఉదయం తుమ్మన్‌పేట గ్రామంలో కొత్తగా నిర్మించిన ఫామ్‌హౌస్‌లో నవదంపతులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. అత్యంత సన్నిహితులు, ముఖ్యులు మాత్రమే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. నవ దంపతులకు గ్రామస్థులు, అభిమానులు కోలాటాలు, జానపద నృత్యాలు, డప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. స్వగ్రామంలోనే రిసెప్షన్ ఏర్పాటు చేయాలన్నది విజయ్ తల్లిదండ్రుల కోరిక అని ఆయన స్వయంగా తెలిపారు.

నూతన దంపతులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు, గ్రామస్తులు తరలివచ్చారు. అందరికీ వెజ్, నాన్-వెజ్ విందు ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చారు. ఎంతమంది వచ్చినా సరే, ఎలాంటి లోటు లేకుండా భోజన ఏర్పాట్లు చేయడం విశేషం. దావత్ వద్దకు స్వయంగా వచ్చిన విజయ్-రష్మిక అభిమానులకు నమస్కరించి, ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గ్రామంతో తనకు ఉన్న అనుబంధాన్ని భావోద్వేగంగా వివరించారు. 'నాన్న ఎప్పుడూ ఊర్లో పొలం కొని ఇల్లు కట్టుకుందామని చెప్పేవారు. ఆ కోరిక నెరవేరింది. పెళ్లి, ఇల్లు ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇకనుంచి తరచూ గ్రామానికి వస్తాం'అని అన్నారు. తమ్ముడు ఆనంద్ పెళ్లిని కూడా గ్రామంలోనే అందరి సమక్షంలో నిర్వహిస్తామని ప్రకటించారు. 'ఊరికి చేసేది చాలా ఉంది. అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం' అంటూ విజయ్ గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ప్రకటించారు. సేవా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తామని హామీ ఇచ్చారు.
దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్యా సేవ
ఆ సందర్బంగా విజయ్ దేవరకొండ సామాజిక బాధ్యతలో భాగంగా కీలక ప్రకటన కూడా చేశారు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9వ, 10వ తరగతుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్‌లు అందించనున్నట్లు తెలిపారు. మొదట అచ్చంపేట డివిజన్‌లో ప్రారంభించి, అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయికి విస్తరించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడటం తమ లక్ష్యమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 'విరోష్'అన్నదాన కార్యక్రమాలు
వివాహ సందర్భంగా దేశంలోని పలు ఆలయాల్లో అభిమానులు 'విరోష్' జంట పేరుతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల స్వీట్లు పంచుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ బుధవారం (మార్చి 4) హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్‌కు టాలీవుడ్, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











