ప్రభాస్ కొత్త ప్రాజెక్టు ఆ డైరెక్టర్‌తోనే.. ఇంటర్వ్యూలో లీక్ చేసేసిన విశాల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన చిత్రాలతో సూపర్ స్టార్లు అయిన హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్లు మాత్రం కొందరే ఉన్నారు. అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. కొంత కాలంగా వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తోన్న అతడు.. పాన్ ఇండియా స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు. అయితే, సరైన విజయాన్ని అందుకోవడంలో విఫలం అవుతోన్న ప్రభాస్.. గత డిసెంబర్‌లో 'సలార్: సీజ్‌ఫైర్' అనే సినిమాతో వచ్చి భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన జోష్‌తో కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం 'ప్రాజెక్టు కల్కి', 'స్పిరిట్', 'రాజా సాబ్' వంటి సినిమాలను చేస్తోన్న రెబెల్ స్టార్ ప్రభాస్.. త్వరలోనే 'సీతా రామం' దర్శకుడు హను రాఘవపూడితో కూడా ఓ మూవీ చేయబోతున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన రాకుండానే ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకూ అటు ప్రభాస్ నుంచి కానీ, ఇటు డైరెక్టర్ నుంచి కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ గురించి తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ లీక్ చేశాడు.

Vishal Chandrashekhar Leaks About Prabhas and Hanu Raghavapudi Movie

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్.. త్వరలోనే తాను ప్రభాస్ - హను రాఘవపూడి సినిమాకు వర్క్ చేయబోతున్నట్లు చెప్పాడు. దీంతో ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతుందని అర్థం అయింది. దీంతో రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కనుందని ఇప్పటికే సమాచారం లీకైంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ప్రపంచ యుద్ధం నేపథ్యంతో రూపొందించబోతున్నారు.

Vishal Chandrashekhar Leaks About Prabhas and Hanu Raghavapudi Movie

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించబోయే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించబోతున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఐదు భాషల్లో రూపొందిస్తారని తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X