మరోసారి అగ్ర నిర్మాతతో విశాల్ గోడవ.. డబ్బుల విషయంలో గందరగోళం.. కేసు నమోదు
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరో వివాదంతో వార్తల్లో నిలిచాడు. సీనియర్ నిర్మాతతో డబ్బుల విషయంలో గొడవ రావడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. గతంలోనే నిర్మాతల మండలిలో అనేక వివాదాలను ఎదుర్కొన్న విశాల్ సినిమాల కంటే కూడా ఎక్కువగా కాంట్రావర్సీలతోనే వైరల్ అవుతున్నాడు. విశాల్ పై కూడా చాలా మంది సినీ తారలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సీనియర్ నిర్మాతపై పోలీసు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

అలాంటి వివాదాల్లో ఎక్కువగా..
కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన హీరోగా గుర్తింపు అందుకున్న విశాల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు కొన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు. ఎక్కువగా పైరసీని అంతం చేసే విషయాల్లో విశాల్ చాలా సందర్భాల్లో పోరాడాడు. అప్పుడప్పుడు పొలిటికల్ సంబంధించిన వివాదాల్లోకి వెళుతున్నాడు.

RB చౌదరితో కూడా విశాల్ గొడవ
అసలు మ్యాటర్ లోకి వెళితే.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ అధినేత RB చౌదరితో కూడా విశాల్ గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఆయనపై ఆరోపణలు చేసిన విశాల్ పోలీసు కేసు కూడా నమోదు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా క్లియర్ గా వివరణ ఇచ్చారు.

సినిమాకు ఫైనాన్స్ చేసిన నిర్మాత
విశాల్ నటించిన ఇరుంబు తిరై సినిమాను సొంత ప్రొడక్షన్ లోనే నిర్మించాడు. తెలుగులో ఆ సినిమా అభిమన్యుడు టైటిల్ లో డబ్ చేసి విడుదల చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు నిర్మాత ఆర్బీ.చౌదరి ఫైనాన్స్ చేశారు.

పోలీసులకు ఫిర్యాదు
ఇక తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి కట్టినప్పటికి నిర్మాత RB చౌదరి చెక్ లీవ్స్, బాండ్స్ & ప్రామిసరీ నోట్స్‌ను తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారని దాన్ని ఏ మాత్రం అంగీకరించలేమని, అలాగే అతను సాకులు చెప్పడం మానుకున్నాడు అంటూ చివరకు అతను పత్రాలను తప్పుగా చూపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











