విశాల్ ని రిజెక్ట్ చేసిన నలుగురు టాప్ హీరోయిన్స్.. ఫైనల్ గా వీరితో సెట్టయ్యాడట
మన దక్షిణాది సినిమా దగ్గర తెలుగు హీరోలు ఇతర భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకోవడం ఏమో కానీ తమిళ సినిమా సినిమాలకి కానీ తమిళ్ హీరోలకి గాని మన నుంచి మంచి ఆదరణే ఎప్పుడు నుంచో ఉంది. కాగా అలా తమిళ్ నుంచి మరింతమంది హీరోలు వచ్చి తెలుగులో సక్సెస్ అవుతున్నారు. రీసెంట్ గా శివ కార్తికేయన్, దళపతి విజయ్ లు తెలుగులో మంచి మార్కెట్ ని సెట్ చేసుకున్నారు.
కానీ వీరి కంటే ముందు కొంతమంది యంగ్ హీరోస్ ఎప్పుడో తెలుగు ఆడియెన్స్ లో పాగా వేశారు. కాగా వారిలో హీరో సూర్య ఇంకా నటుడు విశాల్ కూడా ఒకడు. కాగా సూర్య సంగతి పక్కన పెడితే విశాల్ ఇపుడు సౌత్ లో మంచి హాట్ టాపిక్ గా మారాడు. కాగా విశాల్ నటించిన ఎప్పుడో సినిమా ఈ కొత్త ఏడాదిలో రిలీజ్ అయ్యింది. దాదాపు 12 ఏళ్ళు కితం చేసిన "మద గజ రాజ" అనే సినిమాని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి తీసుకొచ్చారు.

అలా వచ్చిన ఈ సినిమా తమిళ నాట ఏకంగా 50 కోట్లు మేర వసూలు కూడా చేసింది. ఈ తర్వాత తెలుగులో కూడా లేటెస్ట్ గా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాలో విశాల్ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసాడు. హీరోయిన్ అంజలి అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ లు ఈ సినిమాలో విశాల్ సరసన నటించారు కానీ ఈ సినిమా విషయంలో మరో ఇంట్రెస్టింగ్ అంశం ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
కాగా విశాల్ తో ఈ సినిమాకి అప్పట్లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్ రిజెక్ట్ చేశారట. కాగా నిజానికి ఈ సినిమాని దర్శకుడు సుందర్ సి కథ శృతి హాసన్ కి చెప్పారట. కానీ అపుడు ఆమె నో చెప్పేసిందట. ఆ తర్వాత దర్శకుడు మళ్ళీ అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న చబ్బీ బ్యూటీ హన్సికకి కథ చెప్తే ఆమె ఓకే చేసింది కానీ తర్వాత మిగతా సినిమాల షెడ్యూల్స్ తో బిజీ మూలాన ఆమె కూడా పక్కకు తప్పుకుంది.

ఇక చేసేది ఏమి లేక మరో బ్యూటీ తాప్సి పన్నుని లైన్ లో పెడితే ఈమె కూడా సినిమా చేయలేదని తెలిసింది. ఇక వీరంతా కాదు కొంచెం ఫ్రెష్ ముఖాన్నే తీసుకుందాం అనుకున్నారు కానీ ఆ కొత్త హీరోయిన్ కూడా ఈ సినిమా రిజెక్ట్ చేసిందట. ఇలా ఏకంగా నలుగురు హీరోయిన్స్ విశాల్ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది.
ఇక వారి తర్వాత అప్పుడప్పుడే అవకాశాలు అందుకుంటున్న అంజలి అలాగే నటులు రాధికా, శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అప్పుడప్పుడే వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమా ద్వారా ఒక హాట్ ఎంట్రీ ఇచ్చింది. కాగా ఇలా అప్పుడు రావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకి ఇన్నేళ్ల విరామం తర్వాత థియేటర్స్ లో విడుదలకి వచ్చింది.


Click it and Unblock the Notifications











