విశాల్ నటించిన అయోగ్య‌ 12న గ్రాండ్ రిలీజ్.. వాస్తవ సంఘటనల ఆధారంగా

విశాల్‌ హీరోగా తమిళంలో రూపొందిన అయోగ్య చిత్రం తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది. ఏ.ఆర్.మురుగ‌దాస్ శిష్యుడు వెంకట్‌ మోహన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విశాల్ స‌ర‌స‌న రాశీఖన్నా కథానాయికగా నటించారు. ఠాగూర్‌ మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సార్థక్ మూవీస్ అధినేత ప్ర‌శాంత్ గౌడ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 12న సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రేజీగా రిలీజ్ చేయ‌నున్నారు.

నిర్మాత ప్ర‌శాంత్ గౌడ్ మాట్లాడుతూ - అయోగ్య త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించింది. అక్క‌డా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో అద‌ర‌గొట్టింది. త‌మిళ క్రిటిక్స్ ఈ చిత్రానికి 3.5 రేటింగులు ఇచ్చి ప్ర‌శంస‌లు కురిపించారు. విశాల్ ఎన‌ర్జీ లెవ‌ల్‌ను ప‌ది రెట్లు ఎక్కువగా చూపించిన సినిమా ఇది. అలాగే క్లైమాక్స్ ఈ సినిమాకే హైలైట్ అని అన్నారు.

 Vishals Aayogya set to release on July 12th

త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా ప‌తాక స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దారు. త‌మిళంలో హిట్ట‌యిన ఈ చిత్రాన్ని తెలుగులో మా సార్థక్ మూవీస్ ద్వారా రిలీజ్ చేస్తుండ‌డం ఆనందాన్నిస్తోంది. తెలుగులో విశాల్ న‌టించిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా విజ‌యాలు అందుకుంటున్నాయి. ఆ కోవ‌లోనే అయోగ్య ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈనెల 12న ఏపీ- నైజాంలో రిలీజ్ చేస్తున్నాం అని ప్రశాంత్ గౌడ్ తెలిపారు.

 Vishals Aayogya set to release on July 12th

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ చిత్రానికి ఆయోగ్య రీమేక్. ఈ సినిమా టాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకొన్నది. అలాగే హిందీలో నిర్మించగా బాలీవుడ్‌లో రూ.200 కోట్లు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X