హీరో విశాల్‌కు షాక్.. ‘టెంపర్ రీమేక్’ రిలీజ్ వాయిదా.. ఫ్యాన్స్ పరేషాన్!

Recommended Video

Actor Vishal's Ayogya Movie Postponed Due To Financial Issues || Filmibeat Telugu

వరుస విజయాలను సొంతం చేసుకొంటున్న విశాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది అభిమన్యుడు విజయంతో జోష్ మీద ఉన్న విశాల్ తాజాగా టెంపర్ రీమేక్ ఆయోగ్య చిత్రంలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆయోగ్యపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ సినిమా మే 10న రిలీజ్ కావాల్సింది. అయితే ఆర్థిక కారణాల వల్ల ఆయోగ్య విడుదల వాయిదా పడింది.

తమిళనాడు వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆ మేరకు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కూడా జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ప్రేక్షకులు కంగు తిన్నారు.

Vishals Ayogya release postponed

ఆయోగ్య రిలీజ్ వాయిదా పడటంపై హీరో విశాల్ స్పందించారు. సినిమాను విడుదల చేయడానికి నా వంతు ప్రయత్నం గట్టిగా చేశాను. నటుడిగా నా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నా వంతు కృషి చేశాను. నా ఒడిలో ఉన్నంత వరకు నా పిల్లాడిని (సినిమా) బాగానే పోషించాను. ఇప్పుడు నా చేతిలో లేకపోవడం ఏమి చేయలేకపోయాను. నా కంటూ ఏదో ఒకరోజు వస్తుంది అని విశాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ రీమేక్‌లో విశాల్‌తోపాటు రాశీఖన్నా, ఆర్ పార్తీపన్, కేఎస్ రవికుమార్, దేవదర్షిణి, వంశీ కృష్ణ తదితరులు నటించారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ రూపొందించింది. ఈ సినిమాలో నటించడానికి కథ నన్ను బాగా ఆకట్టుకొన్నది. తమిళనాడు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఉంది. అత్యాచారం కేసులో శిక్ష చాలా తేలికగా ఉంది. దానిని మరింత కఠినతరం చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X