నవదీప్ అంటే పరమ అసహ్యం.. ఈ లుక్ చూశాక మరీ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్
యంగ్ హీరో నవదీప్ అంటే తనకు అస్సలు ఇష్టముండదని అంటున్నాడు మరో హీరో మంచు విష్ణు. పైగా ఇటీవలే ఆయన షేర్ చేసిన సిక్స్ ప్యాక్ లుక్ చూశాక అతనంటే ఇష్టపడక పోవడానికి మరో కారణం దొరికింది అని అనేశాడు మంచు విష్ణు.
నవదీప్ తన సిక్స్ ప్యాక్ లుక్‌ని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా పంచుకునే సన్గత్య్ తెలిసిందే. నవదీప్ షేర్ చేసిన ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఫొటోల్లో నవదీప్.. కళ్ళు చెదిరే సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా నవదీప్ ఫ్రెష్ లుక్‌పై తాజాగా హీరో మంచు విష్ణు పరోక్షంగా సరదా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

ఇంతకీ నవదీప్ సిక్స్ ప్యాక్ లుక్ చూసిన మంచు విష్ణు ఏమన్నాడో తెలుసా? అది రియల్ పిక్ కాదు.. ఫోటోషాప్‌లో ఎడిట్ చేసిన పిక్ అంటూ సరదాగా ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. సరదాగా అన్నప్పటికీ విష్ణు చేసిన ఈ కామెంట్ సెన్సేషన్‌గా మారింది. మరోవైపు తాను ఇలా సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారడానికి అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా ఆదర్శం అని నవదీప్ అన్నాడు.
నవదీప్ ఇలా సిక్స్ పాక్స్ లుక్ లోకి మారింది అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా కోసమని సమాచారం. ఈ సినిమాలో నవదీప్ విలన్‌గా కనిపించనున్నాడట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











