Ginna Teaser జస్ట్ శాంపిల్.. అదిరిపోతుంది.. సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ రచ్చ

అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈశాన్ సూర్య దర్శకత్వంలో డైనమిక్ స్టార్ మంచు విష్ణు నటిస్తున్న చిత్రం జిన్నా. ఇంటర్నేషనల్ స్టార్ సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జీ నాగేశ్వర్ రెడ్డి కథను అందించగా, కోన వెంకట్ స్క్రిప్టు, రచనా సహకారం అందించార. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్, కోన వెంకట్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.

Vishnu Manchus Ginna teaser goes viral, Here are Sunny Leone, Payal Rajput speech

జిన్నా టీజర్ రిలీజ్ అయిన వెంటనే విశేషంగా ఆకట్టుకొన్నది. విష్ణు చెప్పిన డైలాగ్స్ ఈ టీజర్‌కు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌తోపాటు థ్రిల్లర్‌ అనే ఫీలింగ్‌ను టీజర్ కల్పించింది. విష్ణు కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమనే నమ్మకాన్ని ఈ టీజర్ కలిగించింది.

జిన్నా టీజర్ విడుదల సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. "అభిమానుల ప్రేమ, అభిమానం కోసమే మేం సినిమాలు చేసేది. అభిమానులు లేకపోతే మేం లేము. నా మనసుకి దగ్గరైన సినిమా జిన్నా. నా బంగారు తల్లులు అరియనా, విరియానా పాట పాడారు. నా కెరీర్‌లో నాగేశ్వరరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. నేను డౌన్‌లో ఉన్నసమయంలో ఆయన నాకు దేనికైనా రెడీ తో సూపర్ హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో నా కంటే ముందు సన్నీనే ఫైనల్ చేశారు. హీరోయిన్‌గా పాయల్ అనగానే.. ఒకవైపు సన్నీ, మరోవైపు పాయల్.. ఇక నన్ను ఎవరు చూస్తారు అనుకున్నా అని అన్నారు.

Vishnu Manchus Ginna teaser goes viral, Here are Sunny Leone, Payal Rajput speech

పాయల్ మాట్లాడుతూ.. జిన్నా మూవీ టీజర్ జస్ట్ శాంపిల్.. పిక్చర్ అదిరిపోతుంది. ఈ మూవీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం రావడానికి ప్రధాన కారణమైన మోహన్ బాబు గారికి బిగ్ థాంక్స్. కోన వెంకట్‌తో ఎప్పటినుంచో వర్క్ చేయాలనుకుంది.. ఈ చిత్రంతో ఆ కోరిక నెరవేరింది. విష్ణు గురించి మాటల్లో చెప్పలేను. ఆయన హంబుల్ పర్సన్. మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో, సన్నీతో కలిసి నటించడం సంతోషంగా ఉంది అని అన్నారు.

సన్నీ లియోన్ మాట్లాడుతూ.. మీ అందరి అభిమానం వల్లే మేం పనిచేయ గలుగుతున్నాం. మా కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ఈ టీమ్‌తో వర్క్ చేస్తుంటే ఫ్యామిలీ ఉన్నట్టు అనిపించింది" అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X