భార్యాపిల్లలు అమెరికాలో.. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ అదే: కంటతడి పెట్టుకున్న మంచు విష్ణు
సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా నెటిజన్ల ముందుకొచ్చిన మంచు విష్ణు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరోనా పట్ల జాగ్రత్తలు చెబుతూనే తన భార్యాపిల్లలు అమెరికాలో చిక్కుకుపోయారని చెప్పారు. మరి ఈ టైమ్‌లో మంచు విష్ణు భార్యాపిల్లలు అమెరికాలో ఎందుకున్నారు? అక్కడి పరిస్థితులేంటి? వివరాల్లోకి పోతే..

కరోనా విలయతాండవం.. వణికిపోతున్న దేశాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ బారిన పడినవారి సంఖ్య 8 లక్షలు దాటేయడం, 200కు పైగా దేశాల్లో ఈ వైరస్ వీర విజృంభణ చేస్తుండటం యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం దేశవిదేశాలకు సైతం వణికిస్తోంది.

పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య.. ఆందళనకర పరిస్థితి
ఈ కరోనా వైరస్ భారత దేశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఇక్కడ 1200 లకు పైగా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు కరోనాను నియంత్రించేందుకు యావత్ భారతావని యుద్ధం చేస్తూనే ఉంది. వ్యాక్సిన్ అంటూ లేని ఈ వైరస్ భూతాన్ని అరికట్టాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గం అని లాక్‌డౌన్ విధిగా పాటిస్తున్నారు దేశ ప్రజలు.

మంచు విష్ణు ఆవేదన..
లాక్‌డౌన్ నేపథ్యంలో ఎక్కడున్న వారు అక్కడికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిచిపోవడంతో.. విదేశాల్లో ఉన్న భారతీయులు సొంత దేశానికి రాలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మంచు విష్ణు చెప్పిన ఓ విషయం సినీ లోకంలో ఆందోళన రేకెత్తించింది. తన సతీమణి, పిల్లలు అమెరికాలోనే చిక్కుకుపోయారని అంటూ ఆవేదన చెందారు విష్ణు.

పరిస్థితి విషమించడంతో భార్యాపిల్లలు
ఫిబ్రవరి నెలాఖర్లో తమ బంధువుల్లో ఒకరికి సర్జరీ ఉండటంతో తన భార్యాపిల్లలతో కలిసి అమెరికా వెళ్లానని, అయితే తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల నిమిత్తం తాను ముందుగానే అమెరికా నుంచి తిరిగి రావడం జరిగిందని చెప్పారు మంచు విష్ణు. ఇక తన భార్య విరానిక, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్, ఐరా వద్దామనుకున్న సమయంలో మన దేశంలో పరిస్థితి విషమించి విమానాలు ఆపేయడంతో వాళ్ళు అక్కడే ఉండిపోయారని చెప్పారు.

నా బ్యాడ్ హ్యాబిట్ అదే.. అంతా సహకరించాలి
తనకున్న బ్యాడ్ హ్యాబిట్ భార్యాపిల్లలతో తాను బాగా కనెక్ట్ అయి ఉంటానని, అందుకే వారిని చాలా మిస్ అవుతున్నానని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంచు విష్ణు. చాలా కష్టంగా ఉందని, తనలాగే చాలా మంది బాధ అనుభవిస్తూ ఉండొచ్చు.. కానీ కరోనా కట్టడిలో లాక్‌డౌన్ అనేది చాలా కీలకం కాబట్టి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
Recommended Video
మోసగాళ్లు అంటూ మంచు విష్ణు
ఇకపోతే ప్రస్తుతం 'మోసగాళ్లు' సినిమాలో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్నారు మంచు విష్ణు. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని హాలీవుడ్-ఇండియన్ మూవీగా ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. చిత్రంలో మంచు విష్ణు జోడీగా కాజల్ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











