మంచు విష్ణు ‘మోసగాళ్లు’ స్ట్రీమింగ్ ప్రారంభం: ఏ ఓటీటీలో వచ్చిందో తెలుసా?

చాలా కాలంగా హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు మంచు వారి అబ్బాయి విష్ణు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో 'మోసగాళ్లు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో విష్ణుకు సోదరిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించింది. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన ఈ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో భారీ నష్టాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభం అయింది.

థియేటర్లలో పరాజయం పాలైన 'మోసగాళ్లు' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ మూవీ నేటి నుంచి సదరు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. వాస్తవానికి పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన ఈ చిత్రం డిజిటల్ హక్కుల కోసం చాలా ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్ సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నట్లు అప్పట్లో ఓ న్యూస్ వైరల్ అయింది. ఇక, ఇది ఫ్లాప్ అయినా చాలా ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం.

Vishnu Manchus Mosagallu Streaming on Amazon Prime

మంచు విష్ణు కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాను జెఫ్రీ గీచిన్‌ అనే దర్శకుడు తెరకెక్కించాడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు విష్ణు నిర్మించాడు. ఇందులో రుహి సింగ్ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. సామ్ సీఎస్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, నవదీప్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X