twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెన్నెల కిషోర్ అహంకారి..బల్ల గుద్ది చెబుతున్నా.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్

    |

    మంచు నట వారసుడు, నిర్మాత, నటుడు విష్ణు మంచు నటించిన జీన్నా చిత్రం అక్టోబర్‌లో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ దర్శకుడు జీ నాగేశ్వర్‌రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి కోన వెంకట్ మాటలు, సాహిత్యాన్ని అందించారు. ఈ మూవీ టీజర్ ఆవిష్కరణ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ..

    జిన్నా నా కెరీర్‌లో మైలురాయి

    జిన్నా నా కెరీర్‌లో మైలురాయి

    జిన్నా సినిమా తప్పుకుండా మంచి చిత్రం అవుతుంది. ప్రతీ ఒక్కరు బాగా ఆడాలని, కలెక్షన్లు రావాలని సినిమా తీస్తారు. సినిమా షూటింగ్ సమయంలో, అలాగే ఎడిటింగ్ జరిగే సమయంలో వచ్చే వైబ్స్ సినిమా రేంజ్‌ను చెబుతాయి. జిన్నా కూడా అలాంటి వైబ్‌ను ఇచ్చింది. జిన్నా సినిమా నా కెరీర్‌లో మైలు రాయిగా నిలుస్తుందని బల్ల గుద్ది చెబుతున్నాను అని విష్ణు మంచు అన్నారు.

    నాకు మూడు హిట్లు ఇచ్చిన వ్యక్తి

    నాకు మూడు హిట్లు ఇచ్చిన వ్యక్తి

    దర్శకుడు జీ నాగేశ్వర్ రెడ్డి జిన్నా సినిమాకు కథను అందించారు. నేను వైఫల్యాలతో ఉన్న సమయంలో ఆయన నాకు సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. దేనికైనా రెడీ సూపర్ హిట్ ఇచ్చారు. ఆ తర్వాత కరెంట్ తీగ, వాడో రకం.. వీడో రకం సినిమాతో మూడు హిట్లు ఇచ్చిన వ్యక్తిని ఎలా మరిచిపోతాను అని విష్ణు అన్నారు.

    సినిమా పరిశ్రమలో కోపాలు తాత్కాలికం

    సినిమా పరిశ్రమలో కోపాలు తాత్కాలికం

    దర్శకుడు నాగేశ్వర్ రెడ్డితో నాకు చిన్న గ్యాప్ వచ్చింది. అయితే నాతో డైరెక్ట్‌గా మాట్లాడకుండా కోన వెంకట్ గారితో మాట్లాడించారు. అయితే నాగేశ్వర్ రెడ్డిపై నాకు ఎలాంటి కోపం లేదు. ఆయన చెబితే కథ వింటాను. సినిమా పరిశ్రమలో అలకలు, కోపాలు తాత్కాలికం. ఇండస్ట్రీ ఓ కుటుంబమని భావిస్తాను. కానీ ఇది ఈ సందర్బానికి మాత్రమే వర్తిస్తుంది అని విష్ణు మంచు తెలిపారు.

    వెన్నెల కిషోర్‌కు అహంకారం

    వెన్నెల కిషోర్‌కు అహంకారం

    కమెడియన్ వెన్నెల కిషోర్ నాకు మంచి మిత్రుడు. కానీ అతడికి ఉన్న అహంకారం ఎవరికి ఉండదు. అహంకారం ముందు పుట్టి ఆయన తర్వాత పుట్టారేమో అనిపిస్తుంది. అతడు మర్యాద ఇచ్చినట్టు కనిపిస్తాడు. కానీ నాపై చాలా వ్యంగ్యంగా మాట్లాడుతాడు. అతడిని నేను ఏమీ అనలేను. వెన్నెల కిషోర్ అంటే మా ఇంట్లో వాళ్లందరికి ఇష్టం అని విష్ణు అన్నారు. అయితే నా మాటలు విన్న తర్వాత ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టుకు అని విష్ణు మంచు చురకలు అంటించారు.

    కమెడియన్ సద్దాంపై ప్రశంసలు

    కమెడియన్ సద్దాంపై ప్రశంసలు

    జిన్నా చిత్రంలో చమ్మక్ చంద్ర అద్బుతంగా నటించారు. బ్రిల్లియెంట్ వ్యక్తి. అలాగే పాయల్, సన్నిలియోన్ నాకు స్పూర్తి. అలాగే కమెడియన్ సద్దాం కూడా నాకు ఇన్సిపిరేషన్. కరెంట్ తీగ సినిమాకు ఆర్ట్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. అక్కడి నుంచి నా పక్కన మెయిన్ లీడ్‌గా, నా స్నేహితుడిగా నటించాడు. అతడి జర్నీ ఇన్స్‌పైరింగ్. సద్దాం జర్నీ నిజంగా స్పూర్తిని కలిగించింది.

    English summary
    The teaser of Manchu Vishnu's upcoming film 'Ginna' was unveiled on Friday at AMB mall in Hyderabad. Starring star Manchu Vishnu, Bollywood star Sunny Leone, Paayal Rajput in the lead, the film is directed by Suryaah and produced by Manchu Vishnu under the banner AVA Entertainment & 24 Frames Factory. Presented by Dr M Mohan Babu, the film has already upped the ante with its promotions. Here is the Manchu Vishnu comments on Vennela Kishore
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X