రాజకీయ నాయకుడికి మంచు విష్ణు వార్నింగ్.. లాగు తడిసిపోద్ది అంటూ రెచ్చిపోయి!

Recommended Video

Vishnu Manchu Sensational Dialogues On Politicians || Filmibeat Telugu

నేటితరం రాజకీయ నాయకులకు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు. ఓటర్ ని చూస్తే మీకు లాగు తడిసిపోవాలి.. ఓటర్ పవరేంటో మీకు తెలియాలి అంటూ ఘాటుగా స్పందించాడు. తాను హీరోగా చేస్తున్న ఓటర్ సినిమా ద్వారా రాజకీయాలపై, రాజకీయ నాయకుల పనితీరుపై ప్రజలకు అవసరమయ్యే మెసేజ్ పాస్ చేయబోతున్నాడు మంచు విష్ణు.

'ఓటర్' షాక్ ఎలా ఉంటుందనే రుచి

'ఓటర్' షాక్ ఎలా ఉంటుందనే రుచి

ప్రస్తుతం వస్తున్న సినిమాలు రాజకీయాల పరంగా ప్రజలను మేల్కొలిపేందుకు దోహద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సాధారణ ఓటర్ కి ఉన్న పవర్ తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా 'ఓటర్' రూపంలో మంచు విష్ణు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసి 'ఓటర్' షాక్ ఎలా ఉంటుందనే రుచి చూపించారు మేకర్స్.

స్ట్రాంగ్ డైలాగ్స్.. రాజకీయ నాయకులపై పంచులు

కేవలం 2 నిమిషాల 6 సెకన్ల నిడివి లోనే రాజకీయ నాయకులను ఓ రేంజ్ లో కడిగి పారేశాడు మంచు విష్ణు. స్ట్రాంగ్ డైలాగ్స్‌తో పవర్ ఫుల్ యాక్షన్ కనబడుతూ సాధారణ ఓటర్ లోని కసి రాజకీయ నాయకులకు తెలిసేలా పంచులు విసిరాడు. ఎన్నికల ప్రచారంలో ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు చేసి.. తీరా ఎన్నికలు ముగిశాక ప్రజలను పట్టించుకోని రాజకీయ నాయకుల పనిపట్టే ఓటర్‌గా మంచు విష్ణు చెలరేగిపోయాడు.

ప్రజలను మేల్కొలపడం ఖాయం.. రాజకీయ నాయకుల లాగు తడిసి పోవాల్సిందే

ప్రజలను మేల్కొలపడం ఖాయం.. రాజకీయ నాయకుల లాగు తడిసి పోవాల్సిందే

ట్రైలర్ పరంగా చూస్తే ఈ సినిమా ద్వారా ప్రజలను మేల్కొలిపే ప్రయత్నం చేయబోతున్నారని తెలుస్తోంది. రాజకీయ నాయకుడు అంటే ప్రజా సేవకుడే తప్ప కుప్పలు కుప్పలుగా సొమ్ము దోచుకొని ప్రజల గౌరవ మర్యాదలు పొందాల్సిన వ్యక్తి కాదని.. అందరికీ అర్థమయ్యేలా చెప్పనున్నారు. రాజకీయ నాయకులను చూసి ఓటర్‌ భయపడొద్దని అందరికీ తెలియపర్చనున్నారు. 'రాజకీయ నాయకులకు ఓటర్‌ని చూస్తే ఉ**** పడాలి' అని మంచు విష్ణు ఇస్తున్న వార్నింగ్ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలుస్తోంది.

వివాదం.. ఆలస్యం

వివాదం.. ఆలస్యం

నిజానికి ఈ సినిమా ఎలక్షన్స్ ముందే రిలీజ్ కావాల్సి ఉంది కానీ హీరో మంచు విష్ణుకి, దర్శకుడు జి.ఎస్.కార్తీక్‌కి మధ్య వివాదం తలెత్తడంతో కాస్త ఆలస్యమై ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ సినిమా మంచు విష్ణు కెరీర్ లో ఓ మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఓటర్ మూవీ

ఓటర్ మూవీ

జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓటర్ చిత్రంలో మంచు విష్ణు హీరోగా నటించగా, సురభి హీరోయిన్ గా నటించింది. రామా రీల్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. భారీ అంచనాల నడుమ జూన్ 21 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X