వెన్నెల కిషోర్ ఇంట్లో 2000 నోట్ల కట్టలు.. ఫోటో తీసి బయటపెట్టిన మంచు విష్ణు
భారతీయ కరెన్సీ నుంచి 2000 రూపాయల నోట్ల రద్దు తర్వాత ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతున్నది. ఇక నుంచి 2 వేల రూపాయల నోటు చెలామణిలో ఉండదంటూ భారత ప్రభుత్వం ప్రకటించడం సంపన్న వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. గతంలో నోట్ల రద్దు తర్వాత 2 వేల రూపాయల నోటును కొత్తగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం తెలిసిందే. అయితే ఈ నోటుపై సాధారణ ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి రావడం తెలిసిందే. అయితే పలు పార్టీలు ఈ నోటును నిషేధించాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
పలు పార్టీల డిమాండ్ల నేపథ్యంలో భారత ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడం భారీ చర్చకు దారి తీసింది. అయితే ఈ నేపథ్యంలో నటుడు వెన్నెల కిషోర్ గురించి సినీ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

భారత ప్రభుత్వం 2000 రూపాయల నోటు రద్దు చేసిన అనంతరం విష్ణు మంచు ట్వీట్ చేస్తూ.. శ్రీ వెన్నెల కిషోర్ గారి ఇంటికి వెళ్లినప్పుడు ఈ కింది పోటో తీసుకొన్నాను. ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. వెన్నెల కిషోర్ ఈ నోట్లను ఏం చేస్తాడో అనే ఫీలింగ్ కలుగుతుంది అని కామెంట్ చేశాడు. మంచు విష్ణు ట్వీట్ చేసిన ఫోటోలో 2000 వేల రూపాయల నోట్లు కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నాయి.
మంచు విష్ణు, వెన్నెల కిషోర్ మధ్య ఇలాంటి సరదా సన్నివేశాలు, సెటైర్లు, ట్వీట్లు సాధారణంగా కనిపిస్తుంటాయి. వెన్నెల కిషోర్‌ను ఏడిపించడానికి ఇలా ఫోటో పెట్టి ట్వీట్ చేసి ఉంటారు అనే అభిప్రాయం కలుగుతున్నది. అయితే విష్ణు ట్వీట్‌కు వెన్నెల కిషోర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
అయితే మంచు విష్ణు చేసిన ట్వీట్‌పై నెటిజన్లు చాలా గమ్మత్తుగా స్పందిస్తున్నారు. ఇన్‌కమ్ టాక్స్ వాళ్లు నిజమే అనుకొని రైడ్ చేస్తారు అన్న అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఒక కట్ట ఇవ్వు అన్న.. నేను జాబ్ కొట్టాలి. లాప్ టాప్ కొనుకొంటాను అని మరో నెటిజన్ పోస్టు పెట్టారు. ఒక 10 లక్షలు ఇవ్వు అయ్యా.. లైఫ్ సెటిల్ చేసుకొంటా అని కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











