ఊహించని విధంగా కన్నప్ప టీజర్: శివుడిగా స్టార్ హీరో.. ప్రభాస్ ఎలా కనిపించాడంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం వరుసగా సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. చాలా కాలంగా విజయాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న మంచు విష్ణు ఇప్పుడు 'కన్నప్ప' అనే సినిమాను చేస్తున్నాడు. మహా శివుడి పరమ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీన్ని ముకేష్ కుమార్ సింగ్ అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రూపుదిద్దుకుంటోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డ సంగతి తెలిసిందే.

మంచు విష్ణు టైటిల్ రోల్‌ను చేస్తున్న 'కన్నప్ప' సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా దీన్ని షూట్ చేస్తూ వస్తున్నారు. ఇలా ఇప్పటి వరకే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను వదిలారు.
టాలెంటెడ్ హీరో మంచు విష్ణు నటిస్తోన్న 'కన్నప్ప' మూవీ నుంచి తాజాగా వచ్చిన టీజర్‌లో హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ ఓ ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పారు. ఆ తర్వాత 'తిన్నడు' అనే పాత్రలో మంచు విష్ణు కనిపించాడు. ఆ తర్వాత ప్రభాస్ మూడు అడ్డ నామాలు పెట్టుకుని దర్శనమిచ్చాడు. ఇక, మహా శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా మెరిశాడు.
టెక్నికల్ పరంగా చూసుకుంటే 'కన్నప్ప' సినిమా టీజర్ ఎంతో గ్రాండ్‌గా కనిపించింది. ముఖ్యంగా ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్ చక్కగా కుదిరాయి. సెటప్ అంతా ఎంతో రిచ్‌గా అనిపించింది. మరీ ముఖ్యంగా ప్రభాస్, అక్షయ్ లాంటి స్టార్లు కనిపించడంతో ఈ టీజర్ రేంజ్ పెరిగిపోయింది. మొత్తంగా ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
ఇదిలా ఉండగా.. 'కన్నప్ప' సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ వంటి స్టార్లు అతిథి పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి మణి శర్మ, స్టీఫెన్ సంగీతం ఇస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తీస్తున్నారు.


Click it and Unblock the Notifications











