నలుగురు పిల్లలతో మంచు విష్ణు దంపతులు.. ఫొటోలు వైరల్
చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు మంచు విష్ణు. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన 'ఢీ' అనే సినిమా మినహా ఆయనకు అంత పెద్దగా పేరు తెచ్చినవి తక్కువే. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం అన్వేషిస్తున్న ఈ మంచు వారి అబ్బాయి.. ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. ఇటీవల 'ఓటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఒకే రోజు నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు. ఇందులో ఒక ఇంగ్లీష్ సినిమా కూడా ఉండడం విశేషం.
ఇదిలాఉండగా, మంచు విష్ణు ఇటీవల నాలుగో బిడ్డకు తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయన భార్య విరానికా కొద్దిరోజుల క్రితం ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. గతంలో వీరికి ముగ్గురు పిల్లలు వివియానా, అరియానా, అవ్రామ్‌లు ఉన్నారు. వీరిలో అరియానా, వివియానా కవలలు. తర్వాత బాబు పుట్టాడు. ఇక ఇటీవల పుట్టిన బిడ్డకు ఐరా విద్యా మంచు అని పేరు పెట్టారు. రెండు రోజుల క్రితం ఈ విషయాన్ని విష్ణు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అదే సమయంలో ఆ చిన్నారి ఫొటోను కూడా షేర్ చేశాడు.

తాజాగా మంచు విష్ణు భార్య విరానికా కూడా తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ఐరా విద్యా మంచుతో పాటు ముగ్గురు పిల్లలకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఇవి చూసిన వారంతా తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, వీటిని తమ తమ ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అన్నట్లు విష్ణు చేస్తున్న ఇంగ్లీష్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె విష్ణుకు సోదరిగా నటిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఇటీవల జరిగిన రాఖీ పౌర్ణమి రోజు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











