twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Matti Kusthi Twitter Review: ఊహించని టాక్ అందుకుంటున్న మట్టికుస్తీ.. రవితేజకు డబ్బులొస్తాయా?

    |

    విష్ణు విశాల్‌ హీరోగా నటించిన 'మట్టి కుస్తీ' సినిమా నేడు తెలుగు తమిళ్ లో ఒకేసారి విడుదల అవుతోంది. ఇక ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించిన ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజతో కలిసి విష్ణు విశాల్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ కూడా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్విట్టర్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

    రవితేజ సపోర్ట్

    రవితేజ సపోర్ట్

    గత కొంతకాలంగా విష్ణు విశాల్ డిఫరెంట్ కథలతో ఓవర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ కూడా అందులో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండేలా అతను కథలను సెలెక్ట్ చేసుకుంటాడని తమిళంలో అయితే మంచి గుర్తింపు ఉంది. ఇక తెలుగులో అతనికి రవితేజ సపోర్ట్ చేస్తూ ఉండడం విశేషం. ఇటీవల రవితేజతో కలిసి మట్టి కుస్తీ యూనిట్ ప్రమోషన్ లో కూడా పాల్గొంది. ఆ స్పెషల్ ఇంటర్వ్యూకు కూడా మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఇక విడుదలైన టీజర్ ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడంతో తెలుగులో ఈ సినిమా విడుదల అయింది.

    ఫ్యామిలీ డ్రామాగా

    మట్టి కుస్తి సినిమాను ఫ్యామిలీ డ్రామాగా రూపొందించారు. ఇక ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవతో పాటు డిఫరెంట్ రెజ్లింగ్ అలాగే ఇగో పాయింట్స్ తో కథ కొనసాగుతుంది. ఇక ప్రీమియర్ షో చూసిన వారు ప్రధాన తారాగణంపై ప్రశంసలు కురిపించారు. విష్ణు విశాల్ మరోసారి యాక్టింగ్ తో మెప్పించాడు అని డైరెక్టర్ స్క్రిప్ట్ కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు.

    ఫస్ట్ హాఫ్ కామెడీగా

    ఇక ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉందని అలాగే కొన్ని లవ్ సీన్స్ కూడా అద్భుతంగా వచ్చినట్లు చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తో మరికొంత కామెడీని హైలెట్ చేసిన విధానం కూడా బావుందని అంటున్నారు. ఇక ఇటీవల కాలంలో వచ్చిన సరికొత్త కథాంశం అంటూ అన్ని వర్గాల వారు సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు అని చెబుతున్నారు.

    సరికొత్తగా ప్రజెంట్ చేసినట్లు

    మట్టి కుస్తీ సినిమా డీసెంట్ ఎంటర్టైనర్ అని మరికొందరు నెటిజన్లు స్పందించారు. ముఖ్యంగా విష్ణు విశాల్ రోల్ యాక్టింగ్ బాగుందని కామెడీ కూడా వర్కౌట్ అయినట్లు చెబుతున్నారు. ఇక హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ కూడా PS 1 తరువాత మరో మంచి పాత్రలో కనిపించినట్లు కూడా ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె పాత్రను సరికొత్తగా ప్రజెంట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

    పాజిటివ్ రేటింగ్స్

    మట్టి కుస్తీ సినిమాకు దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. సినిమాలో చూసిన కొంత మంది నెటిజన్లు అయితే సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో హీరో హీరోయిన్ పాత్ర అద్భుతంగా ఉంది అని దర్శకుడు ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా కొనసాగించిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుందని చెబుతున్నారు. ముఖ్యంగా సినిమాలోని పాత్రలు కథకు తగ్గట్టుగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు పాజిటివ్ రేటింగ్స్ కూడా వస్తూ ఉండడం విశేషం.

    English summary
    Vishnu vishal Matti Kusthi movie telugu Twitter Review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X