Vishwak Sen Dhamki: విశ్వక్ సేన్ ధమ్కీ ఫస్ట్ లుక్ వచ్చేది ఎప్పుడంటే?
వెళ్లిపోమాకే అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. తర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్ సినిమాలతో మాస్ ఎంటర్టైన్ చేసిన విశ్వక్ సేన్ పాగల్ మూవీతో లవర్ బాయ్ అవతారం ఎత్తాడు. హిట్ మూవీతో తన ఏజ్‌కు మించిన క్యారెక్టర్లో మంచి నటన కనబర్చాడు. అలాగే ఇటీవల విడుదలైన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్స్ కోసం వివాదంలో పడిన మూవీ పరంగా ఆకట్టుకున్నాడు. తాజాగా మరో కొత్త సినిమాతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు ఈ మాస్ హీరో.

హీరోగా, డైరెక్టర్‌గా..
ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తనదైన శైలీలో దూసుకుపోతున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇటీవల విడుదలైన అర్జున కల్యాణం సినిమాలో 30 ఏళ్లు వచ్చి పెళ్లి కానీ అబ్బాయి పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు విశ్వక్ సేన్. తాజాగా మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో. ఫలక్ నూమా దాస్ చిత్రానికి హీరోగాపాటు దర్శకత్వం వహించి సత్తా చాటిన విశ్వక్ సేన్ మరోసారి అలాగే రిపీట్ చేయున్నాడు. మరోసారి హీరోగా, డైరెక్టర్‌గా ఆకట్టుకునేందుకు ముందుకు వస్తున్నాడు విశ్వక్ సేన్. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న చిత్రం ధమ్కీ.

95 శాతం చిత్రీకరణ..
ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించగా, ఇందులో హీరోయిన్గా నివేదా పేతురాజ్ కథానాయికగా చేస్తోంది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుందని చిత్రయూనిట్ అంటోంది. ఇప్పటికే 95 శాతం చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. మిగిలి భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారట. RRRకి స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్, జూజితో మూవీ క్లైమాక్స్‌ను ప్లాన్ చేయనున్నారని సమాచారం. హైదారాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
పాన్ ఇండియా చిత్రంగా..
దీపావళి నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు దర్శకనిర్మాతలు. బింబిసార చిత్రంలో భాగమైన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్‌కు కొరియోగ్రఫీ చేశారు. ఇందులో వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్‌ను పర్యవేక్షించారు. దినేష్ కే బాబు సినిమాట్రోగ్రఫీని అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్ బాధ్యతలు చేపట్టనున్న ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











