Jr NTR: ఆస్కార్ కూడా నథింగ్.. అన్న మెసేజ్ చూసి కన్నీళ్లు వచ్చాయి.. విశ్వక్ సేన్ ఎమోషనల్

వెళ్లిపోమాకే అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు మాస్​ కా దాస్​ విశ్వక్ సేన్. తర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది, ఫలక్​నూమా దాస్​ సినిమాలతో మాస్​ ఎంటర్​టైన్ చేసిన విశ్వక్ సేన్​ పాగల్​ మూవీతో లవర్ బాయ్​ అవతారం ఎత్తాడు. హిట్​ మూవీతో తన ఏజ్​కు మించిన క్యారెక్టర్​లో మంచి నటన కనబర్చాడు. అలాగే అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో ఏజ్ బార్ వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తాజాగా 'దాస్ కా ధమ్కీ' సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం ఘనంగా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ అయ్యాడు.

కరాటే రాజు నిర్మాణం..

కరాటే రాజు నిర్మాణం..

ఫలక్​ నూమా దాస్ చిత్రంతో డైరెక్టర్ గా మారాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో హీరోగాపాటు దర్శకత్వం వహించి సత్తా చాటాడు. ఇప్పుడు మరోసారి హీరోగా, డైరెక్టర్​గా ఆకట్టుకునేందుకు ముందుకు వస్తున్నాడు విశ్వక్ సేన్. సుమారు నాలుగేళ్ల తర్వాత విశ్వక్ సేన్ మెగా ఫోన్ పట్టుకున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ'. వన్మయే క్రియేషన్స్​, విశ్వక్​ సేన్ సినిమాస్​ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్ హీరోయిన్ గా అట్రాక్ట్ చేయనుంది.

 తారక్ ను పొగుడుతూ..

తారక్ ను పొగుడుతూ..

విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' మూవీకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పా కళావేదికలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా తారక్ ను పొగుడుతూ ఎమోషనల్ అయ్యాడు విశ్వక్ సేన్. "ఇది నా వాయిస్ కాదు. నందమూరి తారక రామారావు ప్రతి ఒక్కరి ఫ్యాన్ వాయిస్" అని విశ్వక్ సేన్ స్పీచ్ మొదలు పెట్టాడు.

 తమ్ముడికి భోజనం పెట్టినట్లు..

తమ్ముడికి భోజనం పెట్టినట్లు..

"ఈరోజు అన్న (ఎన్టీఆర్) చేసింది నా ఒక్కడి కోసం కాదు. ఆయన అభిమాని కోసం. ఇచ్చిన మాట కోసం. పాపం నిద్ర లేకపోయినా ఒక అభిమానికి ఇచ్చిన మాట కోసం ఇక్కడికి వరకు వచ్చారు. మీరు నన్ను నమ్మరు 2 నెలల క్రితం అరేయ్ ఇప్పటికే లేట్ అయిందిరా ఫస్ట్ నువ్ ఇంటికి రా అని చెప్పి.. ఒక తమ్ముడికి భోజనం పెట్టినట్లు పెట్టారు. తర్వాత కారు వరకు వచ్చి నన్ను ఎక్కించేటప్పుడు అన్న ధమ్కీ అనే సినిమాకు నువ్ ఒక్కసారి రావాలన్న అని అంటే.. భలేవాడివే.. మాట ఇచ్చేసిన. నువ్వు వెళ్లు అన్నారు" అని విశ్వక్ తెలిపాడు.

నాకు కబురు పంపారు..

నాకు కబురు పంపారు..

విశ్వక్ సేన్ ఇంకా కొనసాగిస్తూ.. "ఈ మధ్య అన్న ఇంట్లో ఊహించని విషాదం జరిగింది. దీంతో నేను ఆయనకు ఏం గుర్తు చేయాలి. ఇలాంటి టైమ్ లో ఫేవర్ అడగొద్దు. అడగకపోవడమే మంచిది అని సైలెంట్ గా ఉండిపోయిన. కానీ అన్న బ్రదర్ కు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాడి పోగ్రామ్ ఎప్పుడో కనుక్కో అని నాకు కబురు పంపారు. అప్పుడు అసలు ఆస్కార్ కాదు. ఆస్కార్ కూడా నథింగ్ అనిపించింది. ఆరోజు ఇచ్చిన మాట మీద నిలబడిన వ్యక్తి ఆయన" అని పేర్కొన్నాడు.

నా బాధ్యతరా అది..

నా బాధ్యతరా అది..

అరేయ్ నేను రావడం ఒక బాధ్యతరా అని నాకు ఆయన మెసేజ్ చేసినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. థ్యాంక్యూ అన్నా. దేశం మొత్తం గర్వపడేలా చేశావ్. నేను ఎప్పుడో చెప్పాను. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఎన్టీఆర్ అని. ఓరోజు సినిమా టైటిల్స్ లో ఏం పెడదామని అంటే.. నాకు అది ఎలా వచ్చిందో తెలియదు. మాస్ కాదు.. మాస్ అమ్మ మొగుడు అని చెప్పాను. 17 ఏళ్లకే తొడగొట్టి బాంబులు వేసిన ఆయన.. నాకు తెలిసి మళ్లీ హిస్టరీలోనే రిపీట్ కాదు అని ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించిన విశ్వక్ సేన్ ఎమోషనల్ అయ్యాడు.

RRR స్టంట్స్ కొరియోగ్రాఫర్స్..

RRR స్టంట్స్ కొరియోగ్రాఫర్స్..

ఇదిలా ఉంటే దాస్ కా ధమ్కీ చిత్రానికి RRRకి స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్​ ఫైట్​ మాస్టర్స్​ టోడర్​ లాజరోవ్​, జూజితో క్లైమాక్స్​ను ప్లాన్​ చేసినట్లు సమాచారం. అలాగే బింబిసార చిత్రంలో భాగమైన రామకృష్ణ మాస్టర్ యాక్షన్​ ఎపిసోడ్​కు కొరియోగ్రఫీ చేశారు. ఇందులో వెంకట్​ మాస్టర్​ స్టైలిష్​ యాక్షన్​ ఎపిసోడ్​ను పర్యవేక్షించారు. దినేష్ కే బాబు సినిమాట్రోగ్రఫీని అందించగా, లియోన్​ జేమ్స్​ సంగీతం అందించారు. అన్వర్​ అలీ ఎడిటర్ బాధ్యతలు చేపట్టిన ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 22న ఉగాది సందర్భంగా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X