ఆ నిర్మాతరేసు గుర్రం మూవీలో శృతిహాసన్‌లా.. విశ్వక్ సేన్ స్పీచ్ అదిరిపోయిందిగా!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం ఉగ్రం. అల్లరి నరేష్, మిర్నా జంటగా నటించారు. అల్లరి నరేష్ సీరియస్ పాత్రలో నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అందర్నీ ఆకట్టుకొన్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విశ్వక్ సేన్, సందీప్ కిషన్, అడివి శేషు, నిఖిల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..
మూడోసారి చూసినా రోమాలు నిక్కబొడిచి..: స్టేజ్ మీద మాట్లాడక చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఉగ్రం ట్రైలర్ చూడగానే ఈ సినిమాలో నేనుంటే బాగుండనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ కల్పించిన సినిమా ఇది. ట్రైలర్ చూసినప్పుడు రోమాలు నిక్కబోడిచాయి. రెండోసారి, మూడోసారి చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ తగ్గుతుంది. కానీ నాకు మూడోసారి చూసినా ఏ మాత్రం ఇంపాక్ట్ తగ్గలేదు. విజయ్ కనకమేడల అలాంటి సినిమాను తీశాడు. ముందుగా అడ్వాన్స్ కంగ్రాట్స్ అని విశ్వక్ సేన్ అన్నాడు.

రేసుగుర్రంలో శృతి హాసన్ మాదిరిగా : ఉగ్రం సినిమాకు నేను గెస్గుగా రాలేదు. సన్‌షైన్ ఎంటర్‌టైనర్ బ్యానర్‌లో నేను సినిమా చేస్తున్నాను. కాబట్టి ఈ బ్యానర్‌లో నేను ఫ్యామిలీ మెంబర్‌గా వచ్చాను. నిర్మాత సాహోను చూస్తే.. రేసుగుర్రం సినిమాలో శృతిహాసన్ మాదిరిగా అనిపిస్తాడు. ఆయన ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ కనిపించవు. కానీ మనసు మంచింది అని విశ్వక్ సేన్ అన్నారు.

మ్యూజిక్ ఎవరు చేశారని?: ఉగ్రం ట్రైలర్ చేసినప్పుడు ఎవరు మ్యూజిక్ చేశారా? అనిపించింది. శ్రీచరణ్ పాకాల మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతీ సినిమాకు మంచి ఎలివేషన్ ఇస్తాడు. నీతో నాకు పనిచేయాలని ఉంది. లాక్‌డౌన్‌లో ఒప్పుకొన్న సినిమాలు ఫినిష్ అయ్యాయి. ఇప్పుడే కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి నీతో త్వరలోనే కలిసి పనిచేసే అవకాశం ఉంటుందని అనుకొంటున్నాను అని విశ్వక్ సేన్ చెప్పాడు.

అల్లరి నరేష్ అప్పుడే మాస్..: అల్లరి నరేష్ గురించి చెప్పాలంటే.. ఆయన ఇప్పుడు మాస్ కాదు.. కర్ణ చంపేద్దాం రా అంటూ శంభో శివ శంభో చిత్రంలో డైలాగ్ చెప్పినప్పడే ఆయనలో మాస్ చూశాను. ఆ సినిమా చూసేటప్పుడు విజిల్స్ వేశాను. సాధారణంగా ఇండస్ట్రీలో 10 శాతం మంది సినిమా హిట్టు కావొద్దని కోరుకొంటారు. కానీ నరేష్ అన్న సినిమా హిట్ కావాలని 100 శాతం మంది కోరుకొంటారు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు అని విశ్వక్ సేన్ అన్నాడు.
అల్లరి నరేష్ నా అన్న..: అల్లరి నరేష్‌ను చూడగానే నా అన్న అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆయనతో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. ఉగ్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈవెంట్ నన్ను పిలిచిన నరేష్, నిర్మాత సాహో గారికి ధన్యవాదాలు. ఈ సినిమా భారీ హిట్ కావాలని కోరుకొంటున్నాను. చిత్ర యూనిట్‌కు అడ్వాన్స్ కంగ్రాట్స్ అని విశ్వక్ సేన్ అన్నారు.


Click it and Unblock the Notifications











