ఆయన నాకు గాడ్‌తో సమానం.. ఓరి దేవుడా ట్రైలర్‌ లాంచ్‌లో విశ్వక్ సేన్ ఎమోషనల్

పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో పీవీపీ నిర్మించిన చిత్రం ఓరి దేవుడా. విశ్వక్ సేన్, మితిలా పార్కర్, ఆషా భట్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో వెంకటేష్ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏఎంబీలో జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ..

ఓరి దేవుడా సినిమా రిలీజ్ తర్వాత నా జీవితం మరో రకంగా ఉంటుంది. ఓరి దేవుడా మూవీకి ముందు.. ఓరి దేవుడా తర్వాత అనే విధంగా నా కెరీర్ ఉంటుందని గట్టిగా చెప్పగలను. అలాంటి సినిమాను ఇచ్చిన నిర్మాత పీవీపీ గారికి థ్యాంక్స్. డైరెక్టర్ అశ్వత్ సినిమాను అద్బుతంగా తీసి మ్యాజిక్ చేయబోతున్నారు. సినిమా చూసిన తర్వాత ఆనందభాష్పాలు రాల్చడం ఖాయం. లీయోన్ జేమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ బాగా రాశాడు. వెంకటేష్ కాకమాను కామెడీ ఈ సినిమాలో హిలేరియస్‌గా ఉంటుంది అని విశ్వక్ సేన్ అన్నాడు.

Vishwak Sen gets emotional about Victory Venkatesh at Ori Devuda Trailer Launch Event

ఫలక్‌నామా దాస్ సినిమా ట్రైలర్‌ను పెద్ద హీరోతో రిలీజ్ చేయాలనే ఆశ ఉండేది. ఆ సమయంలో వెళ్లి ఒక్కసారి చిన్న రిక్వెస్ట్ చేయగానే.. వచ్చి నా ట్రైలర్ లాంచ్ చేశారు. ఆ రోజు నాకు ఆయన గాడ్‌గా అనిపించారు. ఈ సినిమాలో గాడ్‌గా నటించారు ఈ సినిమా కథ చెప్పగానే వెంటనే సినిమా చేశాడు. మీలాంటి బ్రదర్ ఉంటే బాగుంటుందనిపించింది అని విశ్వక్ సేన్ ఎమోషనల్ అయ్యాడు.

ఇక మా సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక చాలా థ్యాంక్స్. నన్ను ఓ హీరోయిన్‌లాగా చూసుకొన్నారు. థ్యాంక్యూ సోమచ్.. అని విశ్వక్ సేన్ చెప్పాడు.

Vishwak Sen gets emotional about Victory Venkatesh at Ori Devuda Trailer Launch Event

విశ్వక్ సేన్ తెలుగు సినిమాకు దొరికిన టాలెంట్ యాక్టర్. రెండున్నర ఏళ్ల క్రితం విశ్వక్ సేన్‌కు ఫోన్ చేశాం. ఆఫీస్‌కు మా సినిమాలంటే ఇష్టం. కానీ మీతో ఎందుకో కంఫర్ట్ లేదని చెప్పాడు. దాంతో ఓ అర్దగంట కూర్చొపెట్టి చాలా విషయాలు చెప్పాను. బొమ్మరిల్లు, తొలిప్రేమ కంటే ఓరి దేవుడా పెద్ద హిట్ అవుతుందని ఆరోజే చెప్పాను. అంత గొప్పగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు విశ్వక్ సేన్‌ స్పెషల్ ఎసెట్. ఈ సినిమా రిలీజ్ తర్వాత తర్వాత మూవీకి ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడం కష్టం అని పీవీపీ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X