Vishwak sen: ఆ వయసులో అలా జరిగింది.. విశ్వక్ సేన్ బ్రేకప్ స్టోరీ వైరల్..
Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ తో మాస్ హీరోగా మార్చారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. యూత్ ను ఎంటర్టైన్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. తనదైన స్టైల్ లో అందర్ని అలరించే ప్రయత్నం చేస్తాడు విశ్వక్ సేన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పి అందరికి షాక్ అయ్యేలా చేశాడు.
మస్ కా దాస్ విశ్వక్ సేన్ 'లైలా' అనే యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ యాక్షన్ అండ్ కామెడీ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్లల్లో బిజీగా మారారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

'లైలా' సినిమా కోసం విశ్వక్ సేన్ సాహసం చేశారని చెప్పాలి. ఈ రొమాంటిక్ యాక్షన్ సినిమాలో విశ్వక్ సేన్ అటు అబ్బాయిగా, ఇటు అమ్మాయిగా నటించారు. లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుతున్న బార్బర్ సోన్ (విశ్వక్ సేన్) అనుకోకుండా ఓ ఎమ్మెల్యే హత్య కేసులో ఇరుక్కుంటాడు. దీంతో సోన్ ను చంపడానికి ఓ వైపు ఎమ్మెల్యే మనుషులు, మరో వైపు పోలీసులు గాలిస్తుంటారు. ఈ క్రమంలో సోన్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి, ' లైలా ' అనే లేడీ గెటప్ వేసుకుంటాడు. లేడీ గెటప్‌లోకి మారిన విశ్వక్‌కు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో ఎదురైన పరిణామాలు ఎదురయ్యాయి. ఎమ్మెల్యే హత్య కేసు నుంచి ఎలా బయటపడుతాడనేది తెలుసుకోవాలంటే లైలా సినిమా చూడాల్సిందే. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
ఇక లైలా సినిమా ఈవెంట్ విశ్వక్ బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా లైలా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. తన బ్రేకప్ లవ్ స్టోరీని బయట పెట్టాడు. టీనేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిని చూస్తే ఇష్టం కలుగుతుంది. దాన్ని మనం సీరియస్ రిలేషన్షిప్ అనుకుంటాం.. నాకు కూడా అలాంటి లవ్ స్టోరీ ఉంది. నేను 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డ.. ఆ తర్వాత మూడున్నర వీళ్లకు నా లవ్ బ్రేకప్ అయ్యింది. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత దాని నుండి బయటపడడానికి చాలా టైం పట్టింది' అని పేర్కొన్నారు.

విశ్వక్ సేన్ ఇంకా మాట్లాడుతూ.. అనంతరం కెరీర్ మీద ఫోకస్ చేశా.. ఆ తర్వాత నాకు ఎవరి మీద ఇష్టం కలగలేదు. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా.. కొన్నిసార్లు ఆ విషయాలను తలుచుకుంటే కన్నీళ్లు వస్తాయి. 27 ఏళ్ల వయసులో కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కన్నీళ్లు పెట్టుకుంటే త్వరగా బయటకు రాగలమని విశ్వక్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి విశ్వక్ సేన్ కూడా బ్రేకప్ స్టోరీ ఉందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











