కాలేజీలో విశ్వక్ సేన్-నేహా శెట్టి ఘాటు రొమాన్స్.. విజయ్-సమంతను కాపీ కొట్టారా?

వెళ్లిపోమాకే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విశ్వక్ సేన్ ఫలక్ నూమా దాస్ సినిమాతో మాస్ కా దాస్ గా గుర్తింపు పొందాడు. ఇటీవల దాస్ కా ధమ్కీ సినిమాతో థియేటర్ వద్ద సందడి చేసిన విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వెనువెంటనే చిత్రాలను అనౌన్స్ చేస్తున్నాడు. అందులో ఒకటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari Movie) మూవీ. తాజాగా ఈ సినిమా నుంచి పాటను విడుదల చేశారు. దానిని డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్. ఇటీవలే హీరో కమ్ డైరెక్టర్ గా రూపొందించిన దాస్ కా ధమ్కీ సినిమాతో మంచి హిట్ట్ అందుకున్నాడు. అలాగే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి ఓటీటీలోకి బూ అనే హారర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. బూ మూవీ పర్వాలేదనిపించుకుంది. ఇటీవలే తన 11వ చిత్రంగా VS11గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari)ని ప్రకటించాడు.

Vishwak Sen Neha Shetty Dance Performance In Gangs Of Godavari Song Release

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు రౌడీ ఫెలో, ఛల్ మోహనరంగ చిత్రాల డైరెక్టర్ చైతన్య కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడీగా డీజే టిల్లు బ్యూటి నేహా శెట్టి అలరించనుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా ఇది. క్రూరమైన, నేరపూరిత, చీకటి సామ్రాజ్యంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కథగా మేకర్స్ చెప్పారు.

డిసెంబర్ 8న థియేటర్లలోకి రానున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ఇదివరకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ కాలేజీలో 'సుట్టంలా సూసి' పాటను (Suttamla Susi Song) విడుదల చేశారు. దీనిని జనాల్లోకి వినూత్నంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అచ్చం పాటలో ఉన్న డ్యాన్స్ ను పర్ఫామ్ చేస్తూ స్టేజీపై రీక్రియేట్ చేశారు. నేహా శెట్టి చీర కొంగును విశ్వక్ నోటితో పట్టుకుని స్టెప్పులేశాడు.

అంతేకాకుండా కాలేజీ స్టేజీపైనే విశ్వక్-నేహా శెట్టి ఘాటు రొమాన్సుతో అలరించినా.. అక్కడున్నవారంతా కాస్తా అవక్కయ్యారు. కానీ, అరుపులు, కేకలతో బాగానే ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆగస్ట్ 15న ఖుషి (Kushi 2023) మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ షర్ట్ విప్పేసి మరి సమంతతో రొమాంటిక్ సాంగ్ చేశాడు. విజయ్, సమంత తరహాలోనే విశ్వక్-నేహా శెట్టి రొమాన్స్ పండించారని నెట్టింట్లో కామెంట్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X