Gaami Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గామి ట్రైలర్.. మాలి పత్రాలే అతడి సమస్యకు పరిష్కారం!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి విభిన్నమైన సినిమాలతో వస్తూ ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుటున్న ఈయన ఈ సారి మరో అడుగు ముందుకు వేసి అఘోరాగా కనిపించబోతున్నాడు. కనీసం ఎవరి ఊహకు కూడా అందని పాత్రలో.. మనుషులను కూడా తాకకుండా ఉండే ఓ విచిత్రమైన జబ్బుతో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది. అనక్షణం ఉత్కంఠ భరితంగా సాగుతూ గుస్ బంప్స్ తెప్పిస్తున్న ఈ ట్రైలర్ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.
విశ్వక్ సేన్ హీరోగా.. విద్యాధర్ కాగిత తెరకెక్కిస్తోన్న గామి సినిమాలో విభిన్నమైన కాన్సెప్టుతో వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, టీజర్ లు విపరీతమైన అంచనాలను పెంచేశాయి. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాను యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మిస్తున్నారు. నరేష్ కుమరాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అలాగే విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా కనిపించబోతుంది. వీరు మాత్రమే కాకుండా అభినయ, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు నటిస్తున్నారు.

భారీ అంచనాల నెలకొన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయింది. ఇందులో ముందుగా హిమాలాయాల్లో కూర్చుని మంట కాచుకుంటున్న హీరోను చూపించారు. అయితే ఆయన నేను ఎవరో అసలు ఎక్కడి నుంచి వచ్చానో, నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు అంటూ చెబుతాడు. ఆ తర్వాత ఓ అఘోరా వచ్చి ఆయన్ను చూడడం.. ఇక నువ్వు మా మేలు కోరి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ.. అఘోరాల హెడ్ చెప్పడం చూపిస్తారు. తనకు ఉన్న సమస్యతో అతడు ఎక్కడికి వెళ్తాడు, ఎలా వెతుకుతాడంటూ ఓ అఘోర అనడం మనం చూడొచ్చు.

ఇదంతా అయిపోయాకా.. ఎలుకలు, మనుషు,లై సైంటిస్ట్ లు చేసే ప్రయోగాలను చూపిస్తారు. ఆ తర్వాత దీనికి ఏమాత్రం సంబంధం లేని.. ఓ అమ్మాయిని దేవదాసిగా మార్చుతున్నట్లు చూపిస్తారు. ఆ తర్వాత ఓ పాపను చూపిస్తారు. ఇక ఆ తర్వాత ఆ హీరో విశ్వక్ సేన్ కు ఓ స్వామీజీ.. హిమాలయ శ్రేణిలో ఉండే ద్రోణగిరి అనే పర్వతం మీద ప్రతీ 36 ఏళ్లకు ఒకసారి వచ్చే వైత్రత్రితి నాడు.య.. స్వయం ప్రకాషిత మాలి పత్రాలు వికసిస్తాయయని.. వాటి వల్ల మనుషులను తాకకుండా ఉండే సమస్యను తొలగించుకోవచ్చని చెబుతాడు. ఈ అవకాశం మిస్ అయితే మరో 36 ఏళ్ల ఆగాలని.. త్వరగా హిమాలయాలకు వెళ్లాలని చెబుతాడు.
ఆ తర్వాత హీరో ఆ మాలి పత్రాల కోసం హిమాలయాలకు వెళ్లడం.. ఆక్రమంలోనే ఇతడికి హీరోయిన చాందిని చౌదరి కనిపించడం.. సాయంగా వెంట రావడాన్ని చూపిస్తారు. అయితే ఈ మాలి పత్రాలకు, హీరోకు, దేవదాసిలకు సంబంధం ఏంటనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ఇలా ఆద్యంతం ఆకట్టుకున్న ఈ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. మార్చి 8వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదలకాబోతున్న ఈ సినిమాను చూసేయండి. అసలు కథ ఏంటో తెలుసుకోండి.


Click it and Unblock the Notifications











