విశ్వక్‌సేన్ పాగల్.. ఆ కథేంటో మరి..!
తెలంగాణ యాసలో, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే హీరో విశ్వక్‌సేన్. ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్, హిట్ వంటి చిత్రాలతో దూకుడుమీదున్నాడీ హీరో. వరుసగా ఆఫర్లు రావడంతో ఫుల్ బిజీగా మారిపోయాడు. తాజాగా వచ్చిన హిట్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే ఊపులో ఓ కొత్త సినిమాను ప్రారంభించాడు విశ్వక్‌సేన్. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.
HIT చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా.. నటుడిగా విశ్వక్ స్థాయిని పెంచేసింది. ప్రతీ రివ్యూలోనూ విశ్వక్ నటనను కొనియాడటమే అందుకు నిదర్శనం. అయితే ఈ మూవీ సీక్వెల్ కూడా ఉంటుందని, అందులోనూ విశ్వక్ నటిస్తాడని తెలిపారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ సీక్వెల్‌లో విశ్వక్ నటించకపోవచ్చనే తెలుస్తోంది.

కొత్త పాత్రలు, కొత్త స్క్రిప్ట్‌లు ఎంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆ సీక్వెల్‌ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆ విషయం కాసేపు పక్కన పెడితే.. విశ్వక్ కొత్త చిత్రం నేడు ప్రారంభమైంది. పాగల్ అంటూ టైటిల్ అనౌన్స్ చేసి అందరిలోనూ ఆసక్తిని పెంచాడు. అయితే ఇదో విభిన్నమైన ప్రేమకథ అని తెలుస్తోంది. ఈ మూవీని బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తుండగా.. నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.


Click it and Unblock the Notifications











