సాంకేతిక సమస్యల కారణంగానే.. ‘పాగల్’ టీం క్లారిటీ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఫలక్ నుమా దాస్ సినిమాతో మంచి హిట్ కొట్టేశాడు. నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా అన్ని రకాలుగా తన సత్తాను చాటుకున్నాడు. ఇక HIT సినిమాతో మరింతగా దూసుకుపోయాడు. నటుడిగా ఈ సినిమా విశ్వక్ సేన్‌ను మరో మెట్టు ఎక్కించేసింది. అయితే సీక్వెల్ మూవీలో మాత్రం విశ్వక్ సేన్ నటించబోవడం లేదు.

ప్రస్తుతం విశ్వక్ సేన్ పాగల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ మధ్య వదలిన టీజర్ యూత్‌లో బాగా ఎక్కేసింది. అయితే అక్కడక్కడా విజయ్ దేవరకొండ ఛాయలు కనిపించాయని కొందరు ట్రోల్ చేశారు. కానీ పాగల్ టీజర్ మాత్రం నెట్టింట్లో బాగానే క్లిక్ అయింది.అయితే మంచి ప్రమోషన్స్ చేస్తూ జోరుమీదున్న పాగల్ టీంకు కాస్త షాక్ తగిలినట్టైంది. నేటి సాయంత్రం పాగల్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.

Vishwak Sen Paagal Title song Delay Due To Technical issues

నేటి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు పాగల్ టైటిల్ ట్రాక్ రావాల్సింది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమవుతోందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అన్ని సమస్యలు తొలగిన తరువాత పాటను రిలీజ్ చేస్తామని దిల్ రాజు బ్యానర్ ప్రకటించింది. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలయ్యేందుకు సిద్దమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X