నాని, అడవి శేష్ యాటిట్యూడ్.. దిమ్మతిరిగిపోయే రిప్లై ఇచ్చిన విశ్వక్ సేన్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ చివరిగా 'లైలా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాను ఎంతో బాగా ప్రమోట్ చేసినా.. సినిమా రిలీజ్ తర్వాత మాత్రం ప్రేక్షకుల నుంచి సరైనా స్పందనను దక్కించుకోలేక పోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కూడా విఫలమైంది. ఇక ఏదేమైనా విశ్వక్ సేన్ మళ్లీ కంబ్యాక్ ఇస్తానని, తన ప్రియమైన అభిమానులు మెచ్చే సినిమాలు చేస్తానని హామీనిచ్చారు.
ఈ క్రమంలో ఈసారి తన రాబోయే చిత్రాలతో ఎలాగైనా హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నెక్ట్స్ రూపుదిద్దుకుంటున్న సినిమాలపై మరింత ఫోకస్ పెట్టారు. లైలా సినిమా ఫెయిల్యూర్ తర్వాత తన అభిమానులకు హామీనిచ్చిన విశ్వక్ సేన్ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. సీరియస్ గా తన లైనప్ మూవీలపై ఫోకస్ పెట్టారు. ఇక తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన 'హిట్ 3' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన ప్రసంగాన్ని ఇచ్చారు.

హిట్ : ది థర్డ్ కేసు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన సందర్భంగా విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే తన వయస్సు 30కి చేరుకుందని తెలిపారు. ఇన్నాళ్లు కాస్తా స్పీడ్ ఎక్కుమైందని, ఇప్పుడిప్పుడే కూల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఊరికే అటు ఇటు పరిగెడుతూ ఉన్నా.. ఇప్పటి నుంచి అది తగ్గిపోతుందని అని చెప్పారు. నాని, అడివి శేష్ నుంచి కూల్ గా ఉండటం నేర్చుకుంటున్నాను. ఇక హిట్ సిరీస్ నాది. అలాగే నాని అన్నది, అడివి శేష్ ది కూడా. ఇలా హిట్ సిరీస్ అనేది అందరిదీ అని భావిస్తున్నాను.
Hit 3తో ఇండియాలో మంచి రెస్పాన్స్ దక్కుతుందని అనుకుంటున్నాను. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, ఇక శైలేష్ ఈ హిట్ సిరీస్ లో డజన్ సిరీస్ లు తీస్తారనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. త్వరలోనే తను కూడా హిట్ సిరీస్ లో తిరిగి కనిపిస్తానని చెప్పారు. ఇంకా విక్రమ్ రుద్రరాజు పాత్ర ముగియలేదని, మరిన్ని కేసులు సాల్వ్ చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు. దీంతో హిట్ సిరీస్ పై మరింతగా హైప్ పెంచేశారు. అలాగే త్వరలో తన పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు. ఇంట్లో అమ్మకు చెప్పాను త్వరలోనే ఉంటుందన్నారు. యాంకర్ సుమతో చెప్పుకొచ్చారు. ఇక తన స్పీచ్ తో అటిట్యూడ్ అటిట్యూడ్ అని విశ్వక్ సేన్ ను తప్పుగా చూపించే వారికి ఇలా సున్నితంగా బదులివ్వడం ఆసక్తికరంగా మారింది.
ఇక హిట్ 3 చిత్రం మే1న పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. జమ్మూ కాశ్మీర్, విశాఖ పట్నం, హైదరాబాద్ వంటి పాంత్రాల్లో ఈ చిత్రాన్ని షూట్ చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మరోవైపు విశ్వక్ సేన్ 'ఫంకీ', VS13వ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











