Don't Miss!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
చెప్పినా ఎవరూ నమ్మరు.. డిఫరెంట్ సినిమాకు సపోర్ట్ ఇచ్చిన హీరో విశ్వక్ సేన్
టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలకు ఒక వర్గం ఆడియెన్స్ నుంచి భారీ క్రేజ్ లభిస్తోంది. స్టార్ సెలబ్రెటీస్ లేకపోయినా కూడా కాన్సెప్ట్ బావుంటే సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మౌత్ టాక్ తోనే మరికొన్ని సినిమాలు ప్రమోషన్స్ కూడా అవసరం లేదని నీరూపిస్తున్నాయి. ఇక ఇటీవల అదే తరహాలో ఆకట్టుకోవాలని ఒక చిత్ర యూనిట్ సరికొత్త అడుగులు వేస్తోంది. "చెప్పినా ఎవరూ నమ్మరు" అనే సినిమా కామెడీ త్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ తదితరులు నగించిన ఈ సినిమాను శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని లాక్డౌన్ తరువాత థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ హీరో విస్వక్ షేన్ "చెప్పినా ఎవరూ నమ్మరు" చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశాడు. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందాని చిత్ర యూనిట్ లోని అందరికి తన బెస్ట్ విషెస్ అందించారు.
అడిగిన వెంటనే మా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించిన విష్వక్ సేన్ కి చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. సపోర్ట్ చేసిన విశ్వక్ సేన్ కి యూత్ లో మంచి ఇమేజ్ ఉందని అంటూ భవిష్యత్ లో మంచి విజయాలు సాధించి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నామని నిర్మాత నిర్మాత మురళి శ్రీనివాసులు తెలియజేశారు. సాంకేతిక విలువల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా చిత్రాన్ని రూపొందించడం జరిగిందిని మన తెలుగు ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో వుంటాయని దర్శకుడు ఆర్యన్ వివరణ ఇచ్చాడు.