నన్ను మళ్లీ దిల్‌సుఖ్‌‌నగర్ పంపేస్తారా... అల్లు అరవింద్ ముందు విశ్వక్‌సేన్ ఆవేదన

శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, స్మెహా మనిమేగలై హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ దీవానా. ఆర్హా మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈశ్వర్ చంద్ సంగీతం అందించగా.. వంశీ పచ్చిపులుసు డీవోపీగా, హృషికేష్ పసపాల్ ఎడిటర్‌గా వ్యహరించారు. హైదరాబాద్‌లో ఈ రోజు దీవానా మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాస్ కా దాస్ విశ్వక్‌సేన్, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ ఆసక్తికరంగా మారింది.

తొలుత విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. సినిమాలు ప్రొడ్యూస్ చేసే కొద్దీ నిర్మాతలు ఎండిపోయి, నవ్వు మాయమైపోయి, జుట్టు ఊడిపోయి కనిపిస్తారు. కానీ అల్లు అరవింద్ గారి గ్యాంగ్ ఒక్కటే హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్స్ గ్యాంగ్. ఎస్‌కేఎన్ గారు, బన్నీ వాసు గారు, ధీరజ్ గారు ఇప్పుడు వాసు. ఆ వెంటనే అల్లు అరవింద్‌ని చూస్తూ నేనంటే పగా సార్ మీకు.. గీతా ఆర్ట్స్‌కి ఫస్ట్ సినిమా లాగా ఆడిషన్ ఇస్తాను అని అన్నారు విశ్వక్‌సేన్. నువ్వు డబ్బులు ఎక్కువ అడుగుతున్నావని అల్లు అరవింద్ అనగా.. మీకేం తక్కువుంది సార్ థియేటర్లు మీవే, కూర్చొన్న సీటు కూడా మీదే, నా లాంటి వాళ్లకు పంచితే ఇండస్ట్రీ మంచిగా ఉంటుందని విశ్వక్‌సేన్ అన్నారు. మా దిల్‌సుఖ్‌నగర్ నుంచి మరో కుర్రాడు ఇండస్ట్రీలోకి వస్తున్నాడు. హర్షిత్ రెడ్డికి నాకు ముందు నుంచే పరిచయమని విశ్వక్ తెలిపారు.

Vishwak Sen s Funny Banter with Allu Aravind at Deewana Trailer Launch event

మీకు కూడా వన్‌సైడ్ లవ్‌స్టోరీ లాంటిది ఏదైనా ఉంటే ఒక మెమొరీ షేర్ చేయమని యాంకర్ స్రవంతి అడగ్గా.. లైఫ్ అంతా వన్ సైడే సరిపోయింది. నేను టెన్త్ క్లాస్‌లో ఉండగా డీపీఎస్ అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాదు.. దిల్‌సుఖ్‌నగర్ పబ్లిక్ స్కూల్‌. మా డాడీ బైక్ దొంగతనంగా తీసుకుని డీపీఎస్ బయటికి వెళ్లి వన్ ఇయర్ ఆ అమ్మాయిని చూశాను కానీ మాట్లాడలేదు. ప్రతివారం వెళ్లేవాడిని, ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లయిపోయిందని తన ప్రేమకథని విశ్వక్‌సేన్ బయటపెట్టారు.

అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ.. విశ్వక్‌సేన్‌తో నాకు ఐదారేళ్లుగా సినిమా చేయాలనుంది. కథ చూస్తుంటాం, మరిచిపోతుంటాం.. నువ్వు డబ్బులు ఎంత తీసుకుంటావా చెబితే అడ్వాన్స్ ఇస్తానని హీరోని ఆటపట్టించారు. విశ్వక్‌సేన్‌తో చేయడానికి త్వరలోనే టైం వస్తుందని అనుకుంటున్నానని అల్లు అరవింద్ తెలిపారు. ఇంతలో యాంకర్ స్రవంతి వచ్చి విశ్వక్‌సేన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అని అడిగింది. దీనిపై అల్లు అరవింద్ కూడా ప్రశ్నించగా.. హీరోయిన్లను చూడగానే తెలుగు కుర్రాడిని చేసుకోమని చెబుతారు, అంతేకానీ తెలుగు అబ్బాయిని చూపించారా? అని ప్రశ్నించాడు విశ్వక్‌సేన్.

ఇదివరకటి కంటే చాలా గ్లామరస్‌గా తయారయ్యావు, స్కిన్ టోన్ మారిపోయి ఏంటీ ఇలా అయిపోయావని అడిగితే ఏడాదిగా తిండి మార్చేసి ఫిట్‌గా అవ్వాలని అనుకున్నాను అన్నావు. ఇంత బాగా రెడీ అయ్యేది ఒక అమ్మాయి కోసమే కదా? ఎవరు ఆ అమ్మాయి అని అరవింద్ ప్రశ్నించారు. హీరోయిన్లకు మాత్రం ఎవరిని పెళ్లి చేసుకోవాలో చెబుతారు.. నన్ను మాత్రం ఎప్పుడు పెళ్లి అని అడుగుతున్నారా? అది కూడా చెబితే వెళ్లి తాళి కట్టేస్తానని విశ్వక్ తెలిపారు. అయితే దిల్‌సుఖ్‌నగర్‌లో చూడు నాకు తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారని అరవింద్ చెప్పగా.. దిల్‌సుఖ్ నగర్ నుంచి కష్టపడి జూబ్లీహిల్స్ వస్తే మళ్లీ దిల్‌సుఖ్ నగర్ పంపిస్తారా అని విశ్వక్‌సేన్‌ నవ్వుతూ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుండగా.. విశ్వక్‌సేన్ పెళ్లి గురించి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: vishwak sen allu aravind
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X