HIT ట్రైలర్: అసలు ఆ పబ్‌లో ఏం జరిగింది?
హీరోగా సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న నాని నిర్మాణ రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్దమయ్యాడు. సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఆయన ఇప్పటికే 'అ' అనే విలక్షణ కథాంశాన్ని రూపొందించి భేష్ అనిపించుకున్నారు. అదే బాటలో ఇప్పుడు HIT అనే మరో వినూత్న కథాంశాన్ని రూపొందిస్తున్నారు.
ఫలక్‌నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన HIT పోస్టర్స్, టీజర్ మంచి స్పందన తెచ్చుకొని సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా HIT ట్రైలర్ రిలీజ్ చేసి ఇప్పటికే ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది చిత్రయూనిట్. పబ్‌లో మిస్ అయిన ప్రీతి అనే అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుందని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అసలు ఆ పబ్‌లో ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎలా అదృశ్యమైంది? చివరకు ఆ ఇన్వెస్టిగేషన్‌లో హీరో విశ్వక్ సేన్ సక్సెస్ అయ్యాడా? అనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని అర్థమవుతోంది.

నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న ఈ HIT సినిమాకి శైలేశ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రంలో విశ్వక్ సేన్ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. నానితో పాటు ఈ చిత్రానికి మరో నిర్మాతగా ప్రశాంతి వ్యవహరిస్తోంది. నిర్మాతగా కూడా సక్సెస్ కావాలనే పట్టుదలతో ఉన్న నాని ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











