Gaami: ఊహించని విధంగా గామి టీజర్.. విశ్వక్ సేన్ సర్‌ప్రైజ్ అదిరిందిగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ హీరోలు అందరిలో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌తో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. ఆరంభం నుంచీ తనదైన విభిన్నమైన సినిమాలతో సందడి చేస్తోన్న అతడు.. 'దాస్ కా ధమ్కీ'తో హిట్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ చేస్తున్నాడు. ఇది విడుదల కాకముందే.. చాలా రోజుల క్రితమే మొదలు పెట్టిన 'గామి' సినిమాను రేసులోకి తీసుకు వచ్చాడు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రమే 'గామి'. విద్యాధర్ కాగిత తెరకెక్కిస్తోన్న ఈ సినిమా అఘోరా నేపథ్యంతో విభిన్నమైన కాన్సెప్టుతో రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇక, మిగిలిన అన్ని పనులనూ వీలైనంత త్వరగా పూర్తి చేసి.. సినిమాను త్వరలోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు.

యంగ్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న 'గామి' సినిమా టీజర్‌లో ఇందులో నటించిన క్యారెక్టర్లను చూపించారు. అందులో ఏదో ఒక మ్యాప్‌ను కూడా హైలైట్ చేశారు. దానిబట్టే కథ నడుస్తుందని అర్థం అవుతుంది. అఘోర అయిన హీరో ఏం సాధించబోతున్నాడు అనేది ఈ చిత్రం నేపథ్యం అని తెలిసింది. మొత్తంగా ఇది సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ముఖ్యంగా ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ అద్బుథంగా వర్కౌట్ అయ్యాయి. దీంతో ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది బాగా వైరల్‌గా మారిపోయింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత వైవిధ్యమైన కథతో రూపొందిస్తోతోన్న 'గామి' సినిమాను యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మిస్తున్నారు. నరేష్ కుమరాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అభినయ కీలక పాత్రను చేస్తుంది. అలాగే, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు నటిస్తున్నారు. ఇక, ఈ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 29వ తేదీన విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











