Gangs Of Godavari: విశ్వక్ సేన్‌కు కిర్రాక్ టైటిల్.. నవ్వుతూనే నరాలు లాగేసేలా!
టాలీవుడ్‌లో ఇప్పుడున్న యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. వరుస చిత్రాలతో దూసుకుపోతోన్నాడు టాలెంటెడ్ గాయ్ విశ్వక్ సేన్. కెరీర్ తొలినాళ్లలోనే తనదైన చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన అతడు.. కొన్ని హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'దాస్ కా ధమ్కీ' అనే మాస్ యాక్షన్ మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. ఈ జోష్‌లోనే వరుస పెట్టి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.
ప్రస్తుతం విశ్వక్ సేన్ తన 11వ సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేస్తున్నాడు. గోదావరి జిల్లాల నేపథ్యంతో సాగే ఈ సినిమా ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అవడంతో పాటు చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక, మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. సినిమాను వచ్చే డిసెంబర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్‌ను పెట్టారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో 'అన్నాయ్.. మేము గోదారోళ్లం.. మాటొకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం' అంటూ విశ్వక్ డైలాగ్ చెప్పాడు. దీంతోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూపించారు. అంతేకాదు, ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ పల్లెటూరి గొడవలకు అద్దం పట్టేలా ఉన్నాయి. దీంతో ఈ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది బాగా వైరల్‌గా మారిపోయింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య వైవిధ్యమైన కథతో రూపొందిస్తోతోన్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్రను చేస్తుంది.


Click it and Unblock the Notifications











