Gangs Of Godavari: విశ్వక్ సేన్‌కు షాకిచ్చిన నిర్మాత.. కొత్త రిలీజ్ డేట్‌తో సంచలనం

టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో టాలెంట్ ఉన్న ఎంతో మంది యంగ్ హీరోలు పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. ఆరంభంలోనే మాస్ ఇమేజ్‌ను తెచ్చుకున్న అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు సాగిపోతోన్నాడు.

'దాస్ కా ధమ్కీ' చిత్రంతో హిట్‌ను సొంతం చేసుకుని జోష్‌లో ఉన్న విశ్వక్ సేన్ ఇప్పుడు తన 11వ చిత్రంగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'ని చేస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా గోదావరి జిల్లాల నేపథ్యంతో సాగే ఈ సినిమా ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టాకీ పార్టును కూడా పూర్తి చేశారు.

Vishwak Sen Starrer Gangs Of Godavari Release On March 8th

పల్లెటూరి మాస్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను డిసెంబర్ 8వ తేదీనే విడుదల చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే దీనికి సంబంధించిన పనులను అన్నీ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మూవీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదలపై కొద్ది రోజుల క్రితం విశ్వక్ సేన్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే.. 'బ్యాగ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకూ మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెప్తున్నా. డిసెంబర్ 8వ తేదీనే వస్తున్నాం. హిట్ చేస్తారా? లేక ఫ్లాప్ చేస్తారా? మీ నిర్ణయం' అన్నాడు.

విశ్వక్ సేన్ చేసిన ట్వీట్‌తో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ డేట్ విషయంలో హీరో, నిర్మాతలకు గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, వీటిని నాగ వంశీ కొట్టి పారేశారు. ఆ తర్వాత కూడా ఈ మూవీ రిలీజ్‌పై పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీన్ని మార్చి 8న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో విశ్వక్ సేన్ ఇప్పుడు దీనిపై ఎలా స్పందిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్రలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X