మిస్ తెలంగాణతో మరోసారి విశ్వక్ సేన్ రొమాన్స్!
హిట్ మూవీతో జోరు మీద ఉన్న యువ హీరో విశ్వక్ సేన్ పాగల్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమవుతున్నారు. హీరోగా ద్వితీయ విఘ్నాన్ని పూర్తి చేసుకొన్న విశ్వక్ విభిన్నమైన కథతో కొత్త సినిమాను ప్రారంభించారు. మార్చి 19న ప్రారంభోత్సవ కార్యక్రమానికి రానా దగ్గుబాటి, జెమిని కిరణ్, దర్శకుడు త్రినాథ రావు తదితరులు హాజరయ్యారు.
అయితే పాగల్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న వెంటాడింది. అయితే ఫిలింనగర్‌లో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం విశ్వక్ సేన్ పక్కన హీరోయిన్‌గా సిమ్రాన్ చౌదరీ నటిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే మిస్ ఇండియా తెలంగాణగా ఎంపికైన ఈ ముద్దుగుమ్మతో విశ్వక్ సేన్ రొమాన్స్ చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

విశ్వక్ సేన్‌తో సిమ్రాన్ నటించడం మొదటిసారి అనుకొంటే పప్పులో కాలేసినట్టే.. 2018లో రిలీజైన ఈ నగరానికి ఏమైంది అనే చిత్రంలో విశ్వక్ సేన్‌తో సిమ్రాన్ కలిసి నటించింది. విశ్వక్ సేన్ నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో సిమ్రాన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది.
తాజాగా సిమ్రాన్ టాలెంట్‌ను దృష్టిలో పెట్టుకొని మరోసారి అవకాశం ఇచ్చేందుకు విశ్వక్ సేన్ నిర్ణయం తీసుకొన్నాడని సమాచారం. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా లక్కీ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతున్నది.


Click it and Unblock the Notifications











