మంచు లక్ష్మీతో విశ్వక్ సేన్.. ఆహా అనిపిస్తున్నారుగా!
తెలుగు భాష మీద దాదాపు అన్ని ఓటీటీ సంస్థలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి.. ఏకంగా అల్లు అరవింద్ అయితే తెలుగులో మొట్టమొదటి ఓటీటీ అంటూ ఆహా సంస్థను నెలకొల్పిన సంగతి కూడా తెలిసిందే. ఈ సంస్థ నుంచే లక్ష్మీ మంచు డిజిటల్ మీడియాలో సందడి చేయనుంది. తెలుగు నెంబర్ వన్ ఓటీటీగా మారిన ఆహా నుండి కేవలం సినిమాలే కాదు.. స్పెషల్ షోస్ కూడా గట్టిగా ప్లాన్ చేశారు. ఇప్పటికే సమంత అక్కినేని తో సామ్ జామ్ అనే టాక్ షో ని సక్సెస్ చేసిన ఆహా వారు ఇప్పుడు మంచు లక్ష్మి హోస్ట్ గా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం మొదలు పెట్టింది.
ఈ సారి రొటీన్‌కు భిన్నంగా ఈ వంట కార్యక్రమానికి ఆమె యాంకర్ గా వ్యవహరించనుండటం విశేషం. మొట్టమొదటి తెలుగు ఓటీటీ 'ఆహా' లో ఆసక్తికరమైన ఈ టాక్ షో ప్లాన్ చేశారు. సాధారణంగా టాక్ షో అంటే సెలబ్రిటీలు వచ్చి మాట్లాడి వెళ్లిపోతారు. కానీ మంచు లక్ష్మి మాత్రం సదరు సెలబ్రిటీలతో వంటలు చేయిస్తూ వారితో మాట్లాడించనుంది.

ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు, అఖిల్ అక్కినేని, రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్, తరుణ్ భాస్కర్, ఆనంద్ దేవరకొండ, విష్వక్‌సేన్ వంటి స్టార్స్ ఈ షోలో పాల్గొనబోతున్నారని ముందు నుంచే ప్రచారం జరగగా ఇప్పుడు మొదటి ఎపిసోడ్ స్ట్రీమ్ కావడానికి సిద్దమయింది. 'ఆహా భోజనంబు' పేరుతో రూపొందిన ఈ షోలో సెలబ్రిటీలు రుచికరమైన వంటకాలను వండుతూ మంచు లక్ష్మీతో వంటలపై తమకున్న ప్రేమను తెలియజేస్తూ తమ పర్సనల్ సంగతులు కూడా తెలియజేస్తారు. 'ఆహా భోజనంబు' కార్యక్రమం టాక్ షోలలో ఒక సరి కొత్త ఫార్మేట్ అనే చెప్పాలి. టాక్ షోస్ చేయడంలో లక్ష్మీకి మంచి అపారమైన అనుభవం ఉన్న నేపథ్యంలో అందరిలోనూ ఈ షో మీద ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











