పాగల్ టీజర్: యాక్షన్ డోస్ పెంచిన విశ్వక్ సేన్.. కుమ్మేశాడు!
ఈ నగరానికి ఏమైంది సినిమాతో విశ్వక్ సేన్ టాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ఆ సినిమా యూత్ కు ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనంతరం ఫలక్ నుమా దాస్ తో మాస్ ఆడియెన్స్ ను కూడా అమితంగా ఆకట్టుకున్న విశ్వక్ నాని ప్రొడక్షన్ లో వచ్చిన రెడ్ సినిమాతో మరో డీసెంట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ యాంగిల్ లో హిట్ కొట్టడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన సినిమా పాగల్. సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమాలో విశ్వక్ స్టైలిష్ యాటిట్యూడ్ తో కనిపిస్తున్నాడు. ప్లే బాయ్ లాగా విభిన్నమైన హావబవలను చూపిస్తున్నట్లు అర్ధమవుతోంది. టీజర్ అయితే బజ్ బాగానే క్రియేట్ చేసేలా ఉందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

విశ్వక్ ఈ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా హ్యాండ్సమ్ గా కూడా కనిపిస్తున్నాడు. ఇక యాక్షన్ డోస్ కూడా గట్టిగానే ఉంది. మొదటిసారి విశ్వక్ యాంగిల్ ను మార్చడాని అనిపిస్తోంది. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దిల్ రాజు సమర్పణలో వస్తుండడం వలన ఏప్రిల్ 30న భారీ స్థాయిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ మ్యూజిక్ అందించాడు.


Click it and Unblock the Notifications











