For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ హీరో కుమార్తెతో విశ్వక్ సేన్ రొమాన్స్.. ప్లాన్ మామూలుగా లేదు!

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో భిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఈ హీరో ఎలాంటి సినిమా తీసిన కూడా తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన అశోకవనంలో కళ్యాణం సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    ఆ సినిమాకు చేసిన ఫ్రాంక్ వీడియో కాంట్రవర్సీగా చాలా ఉపయోగపడింది అనే చెప్పాలి. ఏకంగా మీడియా ఛానల్స్ లో కూడా విశ్వక్ స్పందించిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత విశ్వక్ అయితే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు కూడా ఒక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

    vishwak sen upcoming project with senior hero arjun

    రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు ప్రాజెక్టులపై స్పందించిన విశ్వక్ త్వరలోనే ఒక సీనియర్ హీరో దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలపడం విశేషం. అంతేకాకుండా సినిమాలో ఆ సీనియర్ హీరో కూతురు నటించే అవకాశం ఉన్నట్లు కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఆ ప్రముఖ నటుడు మరెవరో కాదు సౌత్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ అందుకున్న అర్జున్ సర్జా.

    ఇంతకుముందే విశ్వక్ అర్జున్ తో ఒక కథ విషయంలో చర్చలో మొదలుపెట్టినట్లు గా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే వినిపించాయి. ఇక మొత్తానికి ఆ వార్తలపై కూడా అఫీషియల్గా స్పందించిన విశ్వక్ అర్జున్ గారితో నేను సినిమా చేయబోతున్న విషయం నిజమే అని అన్నాడు. అయితే ఇంకా స్క్రిప్టు దశలోనే ప్రాజెక్ట్ కొనసాగుతుందట.

    ఇక ఆ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య కూడా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది అనే ముఖ్యంగా తెలుగులో ఆమెను పరిచయం చేసేందుకే అర్జున్ సర్జా విశ్వక్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే విశ్వక్ మాత్రం హీరోయిన్ విషయంలో అయితే ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేను అని తెలియజేశాడు. మరి ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఆమె నటిస్తుందో చూడాలి. మరోవైపు విశ్వక్ ఒక థ్రిల్లర్ సినిమాను కూడా లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

    English summary
    vishwak sen upcoming project with senior hero arjun
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X