విశ్వక్సేన్ హిట్ అప్‌డేట్.. టీజర్ ఎప్పుడంటే..?
నిర్మాతగా రెండో విజయాన్ని అందుకునేందుకు నాని సిద్దంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఫలక్‌నుమా దాస్ సినిమాతో హీరోగా ఫ్రూవ్ చేసుకున్న విశ్వక్సేన్ హీరోగా 'హిట్' అనే టైటిల్ పెట్టి.. హిట్ కొట్టేందుకు వచ్చేస్తున్నాడు నాని. కొత్త ఏడాది కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలి హైప్ పెంచింది చిత్రయూనిట్.
ఫస్ట్ గ్లింప్స్‌తో హైప్ క్రియేట్ చేసిన హిట్.. సినిమాలో విశ్వక్ ఓ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. తన వృత్తిలో భాగంగా ఎదురైన మొదటి కేసును చేదించేందుకు చేసే ప్రయత్నమే హిట్ అని తెలుస్తోంది. ఆ ప్రయాణంలో తనకు ఎదురైన ప్రమాదాలేంటి? ఆ కేసుని ఎలా ఛేదించాడు? అనే విషయాల నేపథ్యంగా ఈ సినిమా సాగబోతోన్నట్లు ఫస్ట్ గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు.

ఈ మూవీకి సంబంధించిన మరో అప్‌డేట్‌ను వదిలారు. ఈ సినిమా టీజర్ జనవరి 31న ఉదయం పది గంటలకు విడుదల కాబోతోందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నట్లు తెలిపారు. విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు శౌలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











