మొన్న HIT కొట్టి ఇప్పుడు 'పాగల్' అయిన విశ్వక్ సేన్.. రానా దగ్గుబాటి సపోర్ట్
క్సెస్ ట్రాక్‌లో వెళ్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ మరో సినిమా మొదలు పెట్టేశాడు. 'పాగల్' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ రోజే (మార్చి 19) ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిపి లాంఛనంగా ప్రారంభించారు. ఇందుకు రానా దగ్గుబాటి సపోర్ట్ అందించారు.
'వెళ్లిపోమాకే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన విశ్వక్ సేన్ ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నుమా దాస్', HIT సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు 'పాగల్' అనే మరో డిఫెరెంట్ టైటిల్‌తో అందరి ముందుకు రాబోతున్నాడు. నరేష్ కుప్పిలి అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఈ రోజు జరిగిన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రానా దగ్గుబాటి, దిల్ రాజు, జెమినీ కిరణ్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి రానా దగ్గుబాటి క్లాప్ నివ్వగా, జెమిని కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దిల్ రాజు దర్శకుడికి స్క్రిప్ట్ అందచేశారు. త్రినాధరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. విశ్వక్ సేన్ కెరీర్ లో రాబోతున్న ఐదో సినిమా ఇది. చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











