విశ్వంభర సినిమా కథ ఏంటో తెలుసా.. పూర్తిగా చెప్పిన డైరెక్టర్ వశిష్ఠ.. ఇక పూనకాలే
మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం విశ్వంభర. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. బింబిసారతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వశిష్ఠ ప్రస్తుతం మెగాస్టార్ తో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దీంతో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ తో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు వశిష్ట ఇంట్రెస్టింగ్ న్యూస్ ను రివీల్ చేశారు. ఈ సినిమా కథ సారాంశాన్ని చెప్పడం తారా స్థాయి అంచనాలను పెంచేసింది. ఇక ఆ వివరాల్లోకి వెళితే..
విశ్వంభర బడ్జెట్ ఎంత?
మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ ను వింటేజ్ లుక్ లో చూపించేందుకు మేకర్స్ చేస్తున్న ప్రయత్నం, భారీ విజువల్స్, స్టార్ కాస్ట్, టాప్ టెక్నీషియన్లు పనిచేస్తుండటం, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం, ప్రత్యేకమైన సెట్స్ ఏర్పాటు చేయడంతో ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.200 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. మున్ముందు ఖర్చులతో సినిమా బడ్జెట్ పెరిగే అవకాశం ఉందా అనేది చూడాలి. వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం విశేషం.

విశ్వంభర స్టోరీ..
మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రం చేయడం పట్ల వశిష్ట కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం కథ గురించి మాట్లాడారు. ఈ సినిమా ఏడేడు పద్నాలుగు లోకాల్లో తన ప్రేయసిని వెతుక్కుంటూ హీరో తిరుగుతూ ఉండటమే అసలు సారాంశం. ఒక్కో లోకంలో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేది సినిమాలోని హైలెట్ అంశాలనీ చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రం కథను కీలు గుర్రం, పాతాళ భైరవి, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి చిత్రాల నుంచి స్ఫూర్తిని పొందానని కూడా వివరించారు. దర్శకుడు చెప్పిన మాటలతో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.
వింటేజ్ లుక్..
ప్రస్తుతం మెగాస్టార్ ను తమ అభిమానులు వింటేజ్ లుక్ లో చూసేందుకు ఎంతగానో ఆశపడుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు వశిష్ట కూడా చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సినిమాలో ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటుందని, మరోవైపు సంగీతం కూడా అదిరిపోతుందని ఇప్పటికే మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
రిలీజ్ డేట్ ఫిక్స్?
విశ్వంభర చిత్రం రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇంకా ప్రేక్షకుల్లో స్పష్టత లేదు. మరోవైపు మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. రీసెంట్ గా అందిన అప్డేట్ ప్రకారం రెండు డేట్లను మేకర్స్ లాక్ చేశారని తెలుస్తోంది. 2025 సెప్టెంబర్ 18, లేదంటే 2025సెప్టెంబర్ 25న రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారంట. ఆ డేట్స్ లో పవన్ కళ్యాణ్ ఓజీ, బాలయ్య అఖండ 2 చిత్రాలు కూడా ఉండటం విశేషం. ఇక ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథన్, ఇషా చావ్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురబి పురానిక్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











