Vishwambhara Teaser Review: విశ్వంభర టీజర్ రివ్యూ.. బాక్సాఫీస్ యుద్దానికి చిరంజీవి ఆగమనం!
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న విశ్వంభర సినిమా యూనిట్ దసరా పండుగ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించారు. మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను విజయదశమి కానుకగా అందించారు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటూ 2025 వేసవిలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. పండుగ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ గురించిన వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో త్రిషా కృష్ణన్, అషికా రంగనాథ్, మరో ఇద్దరు హీరోయిన్లతోపాటు కునాల్ కపూర్ ఓ పవర్ పుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం, చోటా కే నాయుడు సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్, అడ్వంచరస్‌గా రూపొందుతున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్ ఇదే..
నటీనటులు: చిరంజీవి, త్రిషా కృష్ణన్, అషికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యూవీ క్రియేషన్స్
మ్యూజిక్: కీరవాణి
సినిమాటోగ్రఫి: చోటా కే నాయుడు
ఫైట్స్: రామ్ లక్ష్మణ్


Click it and Unblock the Notifications











