‘ఫలక్‌నుమా దాస్ 2’ ప్రకటించిన విశ్వక్ సేన్!
విశ్వక్ సేన్ స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'ఫలక్‌నుమా దాస్'. సినిమాలో బూతులు ఎక్కువగా వాడటంతో పాటు... ప్రమోషనల్ ఈవెంట్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తన సినిమా బాగోలేదన్న వారిని అసభ్య పదజాలంతో తిట్టినట్లు ఆరోపణలు రావడంతో గత వారం రోజులుగా మీడియాలో దీని గురించి హాట్ టాపిక్ నడుస్తోంది.
సినిమా అంత గొప్పగా ఏమీ లేక పోయినా... వివాదాల కారణంగా యూత్ తాకిడి పెరిగింది. తాజాగా హైదరాబాద్‌లో చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ అన్ని ఏరియాల్లో తమ చిత్రం విజయవంతంగా రన్ అవుతుందని తెలిపారు.

విశ్వక్ సేన్ తన ప్రసంగంలో దర్శకుడిగా, నటుడిగా మరిన్ని సినిమాలు చేస్తానని తెలిపారు. అంతే కాదు త్వరలో 'ఫలక్‌నుమా దాస్' చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నట్లు తెలిపారు. మొదటి భాగంగా కంటే మరింత హార్డ్ హిట్టింగ్ మేనర్లో 'ఫలక్‌నుమా దాస్ 2' ఉంటుందని, 2020లో దీన్ని రిలీజ్ చేస్తామన్నారు.
కాగా... ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నైజాం ఏరియాలో మంచి బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. చిన్న బడ్జెట్ మూవీ కావడం, వివాదాలతో హైప్ రావడంతో ఈజీగా పెట్టుబడి రికవరీ అయింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 2 కోట్లకు కొనుగోలు చేయడంతో నిర్మాతలకు అదనపు ఆదాయం వచ్చినట్లు టాక్.


Click it and Unblock the Notifications











