Hide N Seek సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌తో యువ హీరో విశ్వంత్.. దర్శకుడు ఎవరంటే?

కేరింత సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. మోహన్‌లాల్‌తో కలిసి మనమంతా సినిమా ద్వారా అందరి ప్రశంసలు అందుకొన్న యువ నటుడు విశ్వంత్ దుడ్డుమూడి. ఆ తర్వాత జెర్సీ, ఓ పిట్టకథ, కథ వెనుక కథ, తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న చిత్రం హైడ్ అండ్ సీక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను ఖారారు చేస్తూ అధికారిక ప్రకటన చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

సహస్ర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమాకు హైడ్ అండ్ సీక్ టైటిల్‌ను ఖరారు చేశారు. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్నది. ఈ సినిమా ద్వారా బసిరెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

Viswant Duddumpudis Hide N Seek movie title launched by Sudeer Varma

హైడ్ అండ్ సీక్ చిత్ర టైటిల్ లోగోను దర్శకుడు సుధీర్ వర్మ విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిన్న రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. నరేంద్ర బుచ్చి రెడ్డి గారి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.

ప్రముఖ నటుడు సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ, సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి తదితరులు
బ్యానర్: సహస్ర ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: నిశాంత్ ప్రెజెంట్స్
దర్శకత్వం: బసి రెడ్డి రానా
నిర్మాత: నరేంద్ర బుచ్చి రెడ్డిగారి
సినిమాటోగ్రఫీ: చిన్న రామ్
మ్యూజిక్: లిజో కె జోష్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్: నిఖిల్ హాసన్
పీఆర్వో: శ్రీధర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X