Game Changer: చరణ్ తమ్ముడిగా తెలుగు హీరో.. ఆ వెబ్ సిరీస్ బ్యూటీకి లక్కీ ఛాన్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కొందరు పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయారు. అందులోనూ మరికొందరు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో హవాను చూపిస్తోన్న అతడు.. RRR(రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో గ్లోబర్ స్టార్‌ అనే పేరును కూడా దక్కించుకున్నాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తూ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్‌తో కలిసి 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా మధ్యలో కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ దీనికి సంబంధించిన 60 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేసేశారు. ఇక, మిగిలిన పార్టును కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసేలా చిత్ర యూనిట్ ప్లాన్లు రెడీ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

Viswant Role Highlight in Ram Charan Game Changer Movie

'గేమ్ చేంజర్' సినిమాలో ఎంతో మంది స్టార్లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అదే సమయంలో పేరున్న నటీనటులు కూడా భాగం అయ్యారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్ కూడా నటిస్తున్నాడట. రామ్ చరణ్‌కు అతడు తమ్ముడిగా కనిపించబోతున్నాడని తెలిసింది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో బలంగా ఉంటాయని సమాచారం. ఇక, ఈ చిత్రంలో విశ్వంత్‌కు జోడీగా తెలుగు పిల్ల అనన్య (31 weds 21 వెబ్ సిరీస్ ఫేం) నటిస్తుందట. ఇప్పటికే వీళ్ల సన్నివేశాలను కూడా చిత్రీకరించారనే టాక్ వినిపిస్తోంది.

Viswant Role Highlight in Ram Charan Game Changer Movie

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీని వచ్చే సమ్మర్‌లో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X