అజిత్ ‘విశ్వాసం’ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఖరారు
తమిళ స్టార్ అజిత్ నటించిన 'విశ్వాసం' సంక్రాంతి సందర్బంగా విడుదలై తమిళనాడు బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. కోలీవుడ్‌లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన రెండో చిత్రంగా రికార్డులకెక్కింది.
వాస్తవానికి ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే రోజు విడుదల కావాల్సి ఉండగా... తెలుగులో సంక్రాంతి సినిమాల పోటీ కారణంగా థియేటర్లు దొరక్కపోవడంతో విడుదల చేయలేదు. మార్చి 1న మూవీని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వీరం, వేదాలం, వివేగం సినిమాలను తెరకెక్కించిన సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజిత్ సరికొత్త మాస్ లుక్‌తో తన విశ్వరూపం చూపించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ కావడంతో మాస్‌కు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.
ఈ చిత్రంలో అజిత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. సత్యరాజ్, ప్రభు గణేశన్, సంపత్‌రాజ్, యోగిబాబు, వివేక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ఇమాన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











