పబ్లిక్‌గా రెచ్చిపోయిన టాలీవుడ్ కమెడియన్ .. లిప్ లాక్ కిస్సులతో ఘాటు రొమాన్స్
కొందరు నటీనటులు పబ్లిక్ ప్లేసులలో రెచ్చిపోతున్నారు. తమ జీవిత భాగస్వాములు లేదంటే పార్ట్‌నర్స్‌పై విపరీతమైన ప్రేమతో దానిని ఎలా చూపించాలో తెలియక రొమాన్స్‌లో మునిగి తేలుతున్నారు. వాళ్లు కళాకారులని... ఏం చేసినా సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. తాజాగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఒకరు భార్యకు పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు లిప్ లాక్ ఇచ్చాడు. ఈ వివరాల్లోకి వెళితే..
షార్ట్ ఫిల్మ్స్ , వెబ్ సిరీస్ , కామెడీ కంటెంట్ ఉన్న వీడియోలు, రీల్స్‌తో పాపులర్ అయ్యారు వైవా హర్ష. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన ఇతని పూర్తి హర్ష చెముడు. బీటెక్ చదివే రోజుల్లో .. సహజంగా ఇంజనీరింగ్ కాలేజీలలో వైవా జరిగే సమయంలో విద్యార్ధుల రియాక్షన్, లెక్చరర్స్ అనుభవాలు ఎలా ఉంటాయనే దానిపై వైవా అనే కామెడీ షార్ట్ ఫిల్మ్ తీశాడు హర్ష. ఈ వీడియోకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ షార్ట్ ఫిల్మ్ తెలుగు నాట సంచలనం సృష్టించడంతో హర్ష చెముడు కాస్తా వైవా హర్షగా మారిపోయాడు. అంతేకాదు ఈ పాపులారిటీతో అతనికి సినిమాల్లో అవకాశాలు రాగా.. కమెడియన్‌గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్‌లో సత్తా చాటుతూ బిజీ అయ్యాడు.

వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హీరోగానూ నటించాడు. సుందరం మాస్టర్ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు హర్ష. మాస్ మహారాజా రవితేజ నిర్మించిన ఈ మూవీ యావరేజ్‌గా నిలిచినా హర్ష నటనకు ప్రశంసలు దక్కాయి. తన స్నేహితురాలు అక్షరతో ప్రేమలో పడిన హర్ష ఆమెను వివాహమాడారు. అయితే తన పర్సనాలిటీ విషయమై బాడీ షేమింగ్ కామెంట్స్‌ను సైతం ఎదుర్కొన్నారు హర్ష. తన రంగు, శరీరాకృతిపై ఎన్నో మాటలు పడ్డానని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
తాను చిన్నప్పుడు ఆస్తమా బారినపడటంతో త్వరగా కోలుకోవడానికి స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిందని.. దాని ఫలితంగానే శరీరం విపరీతంగా పెరిగిపోయిందని హర్ష ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. చదువుకునేటప్పుడు, అమ్మానాన్నలతో బయటికి వెళ్లినప్పుడు , చివరికి ఇండస్ట్రీలోనూ తాను బరువు కారణంగా ఎన్నో అవమానాలు పడ్డానని హర్ష తెలిపారు. డిజిటల్ మీడియాలో ఇప్పటికీ తనపై జోకులు వేస్తుంటారని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే హర్ష తన వ్యక్తిగత వివరాలు, ఇతర విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత భార్యను అపురూపంగా చూసుకుంటున్నాడు వైవా హర్ష. తాజాగా తన సతీమణి అక్షరను తీసుకుని అమెరికా ట్రిప్ వేశాడు. ప్రస్తుతం న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఆయన ప్రఖ్యాత టైమ్ స్క్వేర్‌లో భార్యకు ఘాటుగా లిప్‌లాక్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అన్న మామూలోడు కాదంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











