Vivek Agnihotri: ప్రభాస్‌తో నాకు పోలికా?.. నన్ను వదిలేయండి: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్
సామాజిక అంశాలను, అందులోని తప్పొప్పులను తన సినిమాలతో వేలేత్తి మరి చూపే హిందీ దర్శకుల్లో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఇదివరకు ఆయన ది తాష్కెంట్ ఫైల్స్ (The Tashkent Files) అనే సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టారు.
అనంతరం ది కాశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) చిత్రంతో యావత్ దేశం మొత్తం పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ది వాక్సిన్ వార్ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఆయన సినిమాలతోపాటు తనదైన వ్యాఖ్యలతో వివాదాలపాలవుతుంటారు. ఇప్పటికే ప్రభాస్ పై పలు ట్వీట్స్ చేసిన వివేక్ అగ్నిహోత్రి.. తాజాగా ఓ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోందంటూ క్లారిటీ ఇచ్చారు.

విమర్శలతో మందుకు: ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమాతోనే ఎన్నో విమర్శలు నెత్తినతెచ్చుకున్న ఆయన పలు వ్యాఖ్యలతో తరచూ వివాదాలకు గురి అవుతుంటాడు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అనేక విమర్శలు వచ్చినా ఎక్కడతగ్గకుండా ముందుకు తీసుకెళ్లాడు.

రాధేశ్యామ్-కశ్మీర్ ఫైల్స్: ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి ది వ్యాక్సిన్ వార్ (The Vaccine War) అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మధ్య వివేక్ అగ్నిహోత్రి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ఘాటు విమర్శలు చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. గతేడాది ప్రభాస్ 'రాధేశ్యామ్' విడుదలైన మార్చి 11నే 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం విడుదలైంది.

ది వాక్సిన్ వార్ తో: అప్పుడు రాధేశ్యామ్ కంటే వివేక్ అగ్నిహోత్రి మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు 'సలార్' విడుదల కానున్న సెప్టెంబర్ 28న 'ది వాక్సిన్ వార్' మూవీని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయంపై "నా కశ్మీర్ ఫైల్స్ మూవీతో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాపై గెలిచాను. ఇప్పుడు నా వాక్సిన్ వార్ మూవీ ద్వారా ప్రభాస్ తో పోటీ పడతాను" అని వివేక్ అగ్నిహోత్రి అన్నట్లుగా రూమర్స్ వచ్చాయి.

మెగా మెగా స్టార్: ప్రభాస్ పై తాను విమర్శలు చేస్తున్నట్లుగా వస్తున్న విమర్శలపై తాజాగా గురువారం (జూలై 27) ట్విటర్ వేదికగా రియాక్ట్ అయ్యాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. "నా పేరు మీద ఇలాంటి ఫేక్ న్యూస్ ఎవరు సృష్టిస్తున్నారో అర్థం కావట్లేదు. మెగా మెగా బడ్జెట్ సినిమాలు చేస్తున్న మెగా మెగా స్టార్ అయిన ప్రభాస్ అంటే నాకు చాలా గౌరవం. మేము కొత్త వాళ్లతో, చిన్న బడ్జెట్ లో, ప్రజలపై సినిమాలు చేస్తుంటాం. మా మధ్య ఏమాత్రం పోలిక లేదు. దయచేసి నన్ను వదిలేయండి" అని వివేక్ రాసుకొచ్చారు.
సలార్ గ్లింప్స్: ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే "ఇప్పుడు సినిమాల్లో మితిమీరిన హింసను గ్లామరైజ్ చేయడం, అర్థం లేని చెత్త సినిమాలను ప్రమోట్ చేయడం కూడా టాలెంట్ గా పరిగణిస్తున్నారు. అసలు నటుడే కానీ వ్యక్తిని బిగ్గెస్ట్ స్టార్ గా ప్రమోట్ చేయడాన్ని అతిపెద్ద టాలెంట్ గా గుర్తిస్తున్నారు" అంటూ సలార్ గ్లింప్స్ టైమ్ లో ప్రభాస్ ను ఉద్దేశించే వివేక్ అన్నట్లుగా ప్రచారం కూడా జరిగింది.


Click it and Unblock the Notifications











