Salaar: ప్రభాస్ నటుడే కాదు.. అదొక నాన్సెన్స్.. ప్రముఖ దర్శకుడి సంచలన కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో తెలిసిందే. ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ రాగా.. ఫ్యాన్స్ మాత్రం చాలా నిరాశచెందారు. సినిమాపై తీవ్రమైన నెగెటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మొదటి వారం భారీ కలెక్షన్స్ వసూలు చేసిన తర్వాత నష్టాలతో ముగిశాయి. ఇందులో ప్రభాస్ లుక్స్ పై కూడా అనేక విమర్శలు రాగా.. తాజాగా డార్లింగ్ స్టార్ డమ్ పై టాప్ డైరెక్టర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

జురాసిక్ పార్క్-డైనోసర్ : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు. అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదారు సినిమాలు ఉండగా.. జూలై 6న 90 సెకన్ల నిడివి గల సలార్ గ్లింప్స్ తో అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చారు. ఇందులో ప్రభాస్ ను జురాసిక్ పార్కులో డైనోసర్ తో పోలుస్తూ మోస్ట్ వయెలెంట్ మ్యాన్ గా చూపించారు.

salaarprabhas

నాన్సెన్స్ యాక్షన్ : అయితే సలార్ టీజర్ తర్వాత ప్రభాస్ పై 'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. సలార్, ప్రభాస్ పేర్లు ఎత్తకుండా లౌడ్ సౌండ్ తో కూడిన నాన్సెన్స్ యాక్షన్ గా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభాస్ స్టార్ డమ్, యాక్టింగ్ పై చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

vivekranjanagnihotri

మార్చేస్తున్నారు : "ఎవరు కూడా హింసాత్మకంగా పుట్టరు. ఎవరైతే యువతను శాంతివైపు ప్రేరేపించాల్సిన ఇండస్ట్రీ ప్రముఖులు ప్రసిద్ధ సాహిత్యం, సినీ రాజకీయాల్లో హింసను గ్లామరైజ్ చేయడం ద్వారా మార్చేస్తున్నారు. ఇలాంటి హింసాత్మక ప్రపంచంలో సృజనాత్మక స్పృహ మాత్రమే పరిష్కారం" అని బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ట్విటర్ వేదికగా తెలిపారు.

టాలెంట్ పుట్టదు : "వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ కు మనం టాలెంట్ లేకుండా పుడతాం. మనం నేర్చుకుంటాం. మనం సాధించి ముందుకు సాగుతాం. టాలెంట్ ఎప్పుడు పుట్టదు" అని ఒక నెటిజన్ రిప్లై ఇచ్చాడు. దీనికి వివేక్ అగ్నిహోత్రి రీట్వీట్ చేస్తూ మరో నోట్ రాసుకొచ్చాడు.

అతిపెద్ద టాలెంట్ : "ఇప్పుడు సినిమాల్లో మితిమీరిన హింసను గ్లామరైజ్ చేయడం, అర్థం లేని చెత్త సినిమాలను ప్రమోట్ చేయడం కూడా టాలెంట్ గా పరిగణిస్తున్నారు. అసలు నటుడే కానీ వ్యక్తిని బిగ్గెస్ట్ స్టార్ గా ప్రమోట్ చేయడాన్ని అతిపెద్ద టాలెంట్ గా గుర్తిస్తున్నారు. ఇక ప్రేక్షకులకు ఏం తెలియదని భావించడమైతే అన్నింటికంటే అతిపెద్ద టాలెంట్" అని అగ్నిహోత్రి పేర్కొన్నారు.

ప్రభాస్ కు పోటీగా : వివేక్ చేసిన ఈ ట్వీట్స్ ప్రభాస్, సలార్ ను ఉద్దేశించే చేశారని చర్చ జరుగుతోంది. కాగా ఇదివరకు ప్రభాస్ సినిమాలకు పోటీగా వివేక్ తన చిత్రాలను రిలీజ్ చేస్తున్నాడని మరో టాక్ నడుస్తోంది. ఎందుకంటే గతేడాది 'రాధేశ్యామ్' విడుదలైన మార్చి 11నే 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు 'సలార్' విడుదల కానున్న సెప్టెంబర్ 28న 'ది వాక్సిన్ వార్' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X