పీఎం నరేంద్రమోదీకి గ్రీన్ సిగ్నల్.. ఇకముందు అచ్చేదిన్!
ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోదీ మూవీ విడుదలకు మోక్షం లభించింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రాజకీయ నేతల గురించి, పొలిటికల్ ప్రయోజనాలను జొప్పించిన సినిమాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ నటించిన పీఎం నరేంద్రమోదీ సినిమాను మే 24వ తేదీన విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి, ఉత్సాహం పెరిగినందున ఈ సినిమాను లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే రిలీజ్ చేయాలని నిర్ణయించాం అని నిర్మాత సందీప్ సింగ్ తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల అధికారులు ఈ సినిమాను వీక్షించి విడుదలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

ఎన్నికల సమయంలో ఓటర్లపై ప్రభావం పడుతుందనే కారణాన్ని చూపుతూ పలువురు ఈ సినిమాపై ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ఈ సినిమాపై విడుదల కాకుండా కోర్టులో పిటిషన్లు వేశారు. వాస్తవానికి ఏప్రిల్5న రిలీజ్ ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. ఈసీ ఆదేశాలతో సినిమా విడుదల వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











