నరేంద్ర మోడీగా వివేక్ ఒబెరాయ్.. 9 గెటప్పులు ఇవే!
భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు ఓమంగ్ కుమార్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పీఎం నరేంద్ర మోడీ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నరేంద్ర మోడీ పాత్రలో నటిస్తున్నాడు. దాదాపుగా పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచారం కార్యకమాలని ముమ్మరం చేసింది. నరేంద్ర మోడీ యుక్త వయసు నుంచి వివిధ గెటప్స్ లో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు.
నరేంద్ర మోడీ పాత్రలో ఉన్న వివేక్ ఒబెరాయ్ 9 గెటప్స్ ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, కాషాయ వస్త్రాలలో, తలపాగ ధరించి ఇలా 9 గెటప్స్ లో వివేక్ ఒబెరాయ్ కనిపిస్తున్నాడు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొంత కాలంగా రాజకీయ నాయకుల జీవిత చరిత్రలపై బయోపిక్ చిత్రాలు ఎక్కువవుతున్నాయి.

ఇటీవల ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలపై చిత్రాలు వచ్చాయి. జయలలిత బయోపిక్ చిత్రీకరణ దశలో ఉంది. ఇలా ప్రముఖుల జీవితాలని దర్శకులు వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలోని అన్ని 23 భాషల్లో పీఎం నరేంద్ర మోడీ చిత్రం విడుదలవుతోంది. సందీప్ సింగ్, ఆనంద్ పండిట్ ఈ చిత్రానికి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











